మంగళవారం 20 అక్టోబర్ 2020
National - Sep 25, 2020 , 12:56:02

సివిల్స్ ఎగ్జామ్ వాయిదా పిటిష‌న్‌పై వ‌చ్చే వారం విచార‌ణ‌

సివిల్స్ ఎగ్జామ్ వాయిదా పిటిష‌న్‌పై వ‌చ్చే వారం విచార‌ణ‌

ఢిల్లీ : సివిల్ స‌ర్వీసెస్ ప‌రీక్ష‌ల‌ను వాయిదా వేయాల‌ని కోరుతూ దాఖ‌లైన పిటిష‌న్‌ను సుప్రీంకోర్టు ఈ 28వ తేదీన విచారించ‌నుంది. దేశంలో కోవిడ్‌-19 సంక్షోభం, వ‌ర‌ద ప‌రిస్థితుల నేప‌థ్యంలో సివిల్ స‌ర్వీసెస్ ప‌రీక్ష‌ను 2-3 నెల‌లు వాయిదా వేయాల‌ని సివిల్స్ అభ్య‌ర్థులు 20 మంది సుప్రీంలో పిటిష‌న్‌ను దాఖ‌లు చేశారు. అక్టోబర్ 4న పరీక్షను నిర్వహించాలని యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (యూపీఎస్‌సీ) నిర్ణయానికి వ్యతిరేకంగా యూపీఎస్‌సీ ఆశావాహులు న్యాయవాది అలఖ్ అలోక్ శ్రీవాస్తవ ద్వారా పిటిషన్ దాఖలు చేశారు. ఈ విషయంపై యూపీఎస్‌సీ, కేంద్రం స్పందన కోరుతూ ఉన్నత న్యాయస్థానం సెప్టెంబర్ 28కి విచారణ వాయిదా వేసింది. సివిల్ సర్వీసెస్ పరీక్ష మే 31వ తేదీనే జరగాల్సి ఉంది. కోవిడ్‌-19 మహమ్మారి వ్యాప్తి నేప‌థ్యంలో విధించిన లాక్‌డౌన్ కార‌ణంగా పరీక్ష వాయిదా పడింది. జూన్ 6న యూపీఎస్‌సీ పరీక్ష కొత్త తేదీని ప్రకటించింది. అక్టోబర్ 4న పరీక్షను నిర్వహిస్తున్న‌ట్లు తెలిపింది. 


logo