సోమవారం 25 జనవరి 2021
National - Nov 24, 2020 , 13:33:40

మోదీ ఎన్నికపై దాఖ‌లైన పిటిష‌న్ కొట్టివేత‌..

మోదీ ఎన్నికపై దాఖ‌లైన పిటిష‌న్ కొట్టివేత‌..

హైద‌రాబాద్‌: ఉత్త‌ర‌ప్ర‌దేశ్‌లోని వార‌ణాసి నుంచి ప్ర‌ధాని మోదీ లోక్‌స‌భ సీటుపై పోటీ చేసి గెలిచిన విష‌యం తెలిసిందే. అయితే ఆ ఎన్నిక‌ను స‌వాల్ చేస్తూ .. బోర్డ‌ర్ సెక్యూర్టీ ఫోర్స్ (బీఎస్ఎఫ్‌) జ‌వాను తేజ్ బ‌హూద‌ర్ యాద‌వ్ ఓ పిటిష‌న్ వేశారు. వాస్త‌వానికి ఆ జ‌వాను.. వార‌ణాసి నుంచి మోదీపై పోటీ చేయాల‌నుకున్నారు. కానీ అత‌ను స‌మ‌ర్పించిన డాక్యుమెంట్ల‌ను తిరస్క‌రించారు. దీంతో మోదీ గెలుపును స‌వాల్ చేస్తూ బీఎస్ఎఫ్ జ‌వాను సుప్రీం కోర్టు ఆశ్ర‌యించారు. ఇవాళ సుప్రీం ఆ పిటిష‌న్‌ను కొట్టిపారేసింది. సీజే బోడ్డే, జ‌స్టిస్ ఏఎస్ బొప‌న్న‌, జ‌స్టిస్ వీ రామ‌సుబ్ర‌మ‌ణ్యంల‌తో కూడిన ధ‌ర్మాస‌నం ఈ తీర్పును వెలువ‌రించింది. జ‌మ్మూక‌శ్మీర్‌లో ఉన్న ఫ్రంట్ లైన్ ద‌ళాల‌కు స‌రైన ఆహారాన్ని ఇవ్వ‌డం లేద‌ని 2017లో బీఎస్ఎఫ్ జ‌వాను తేజ్ బ‌హ‌దూర్ ఆన్‌లైన్‌లో ఓ వీడియో పోస్టు చేశారు. ఆ ఘ‌ట‌న త‌ర్వాత తేజ్‌బ‌హదూర్‌ను బీఎస్ఎఫ్ నుంచి తొల‌గించారు. 


logo