మంగళవారం 01 డిసెంబర్ 2020
National - Nov 09, 2020 , 11:21:11

జైలు నుంచే 31 డిగ్రీలతోపాటు ప్రభుత్వ ఉద్యోగం

జైలు నుంచే 31 డిగ్రీలతోపాటు  ప్రభుత్వ ఉద్యోగం

అహ్మదాబాద్‌ : జైలుకు వెళుతున్నప్పుడు అక్కడే తన భవిష్యత్‌కు బీజం పడుతుందని ఆ ఖైదీ ఊహించి ఉండడు. తాను అనుభవించే శిక్ష సమయంలో 31 డిగ్రీలు పూర్తి చేస్తానని, ప్రభుత్వ ఉద్యోగం కూడా సంపాదిస్తానని ఆ ఖైదీ కనీసం అనుకోని ఉండడు. అయితే జైలులో ఉన్న సౌకర్యాలను ఒడిసిపట్టుకుని  గొప్ప విద్యావంతుడిగా తయారై మరెందరికో మార్గదర్శకంగా నిలిచాడు అహ్మదాబాద్‌కు చెందిన భానుభాయ్ పటేల్. 

భానుభాయ్ పటేల్ మొదట భావ్‌నగర్‌కు చెందిన మహువా తహసీల్‌కు చెందినవాడు. అహ్మదాబాద్ లోని బీజే మెడికల్ కాలేజీ నుంచి ఎంబీబీఎస్ పట్టా పొందిన అనంతరం ఉన్నత విద్యాభ్యాసం నిమిత్తం 1992 లో అమెరికా వెళ్ళారు. ఇక్కడ అతని స్నేహితుడు స్టూడెంట్ వీసాపై పనిచేస్తున్నప్పుడు తన జీతాన్ని భానుభాయ్ ఖాతాకు బదిలీ చేసేవాడు. ఈ కారణంగా అతను ఫారిన్ ఎక్స్ఛేంజ్ రెగ్యులేషన్ యాక్ట్ (ఫెరా) ను ఉల్లంఘించినట్లు ఆరోపణలు వచ్చాయి. దాంతో అతడిపై కేసు నమోదు చేసి విచారించిన కోర్టు 50 ఏండ్ల వయస్సులో 10 సంవత్సరాల జైలుశిక్ష విధించడంతో అహ్మదాబాద్ జైలుకు పంపింది. శిక్ష అనుభవించిన 8 సంవత్సరాలలో 31 డిగ్రీలు అందుకున్నాడు. 

జైలుకు వెళ్ళిన తరువాత కూడా ప్రభుత్వ ఉద్యోగం పొందిన భానుభాయ్.. జైలు నుండి విడుదలయ్యాక అంబేద్కర్ విశ్వవిద్యాలయం నుంచి ఉద్యోగం వచ్చింది. గమ్మత్తు విషయం  ఏమిటంటే జైలుకు వెళ్లిన వ్యక్తికి నిబంధనల ప్రకారం ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వరు. కానీ ఆయన డిగ్రీల కారణంగా అతనికి ప్రభుత్వ ఉద్యోగం కోసం ఆఫర్ వచ్చింది. ఉద్యోగంలో చేరిన తర్వాత 5 సంవత్సరాలలో 23 డిగ్రీలు అందుకున్నాడు. ఇప్పటివరకు మొత్తం 54 డిగ్రీలు తీసుకున్నాడు. ఈ విషయంపై గుజరాతీ, హిందీ మరియు ఇంగ్లిష్ భాషల్లో మూడు పుస్తకాలు కూడా రాయడం విశేషం.  భానుభాయ్‌ పటేల్‌ పేరును లిమ్కా బుక్ ఆఫ్ రికార్డ్స్, ఆసియా బుక్ ఆఫ్ రికార్డ్స్, యూనిక్ వరల్డ్ రికార్డ్, ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్, యూనివర్సల్ రికార్డ్ ఫోరం, వరల్డ్ రికార్డ్ ఇండియాలో నమోదైంది.


 జైలు అనుభవాలతో మూడు పుస్తకాలు

కరోనా వైరస్‌ మహమ్మారి కారణంగా లాక్‌డౌన్ సమయంలో భానుభాయ్ పటేల్‌ తన జైలు అనుభవాలు,  ప్రపంచ స్థాయి రికార్డులకు తన ప్రయాణం గురించి గుజరాతీ, హిందీ మరియు ఆంగ్ల భాషల్లో మూడు పుస్తకాలు రాశారు. గుజరాతీ పుస్తకం 'జెల్నా సాలియా పచ్ కి సిద్ధి', ఆంగ్లంలో 'బిహైండ్ బార్స్ అండ్ బియాండ్' రచించారు. అంతే కాకుండా 13 వ అసెంబ్లీ ఎన్నికల్లో భానుభాయ్ ప్రిసైడింగ్ ఆఫీసర్‌గా కూడా పనిచేశారు. ప్రస్తుతం ఆయన వయసు 65 సంవత్సరాలు. అవివాహితులుగానే ఉన్నారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్‌.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. న‌మ‌స్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

ఇవి కూడా చదవండి:


కంటి అద్దాల కంటే కాంటాక్ట్‌ లెన్స్‌లు ఎందుకు బెటర్‌?

దీపావళి రోజున మధుమేహులకు 'తీపి' కబురు

సిగ్గు పడే వారు తాగితే రెచ్చిపోతారట!

తొందరగా పిల్లలు కలగాలంటే ఈ ఫుడ్‌ తినండి..!

కుంకుమ పువ్వుకు ఎందుకు అంత డిమాండ్