మంగళవారం 31 మార్చి 2020
National - Mar 21, 2020 , 03:19:02

రేపు జనతా కర్ఫ్యూ

రేపు జనతా కర్ఫ్యూ

కరోనా మహమ్మారిపై జనాయుధం

న్యూఢిల్లీ: కరోనా మహమ్మారి భారత్‌పైనా పంజా విసురుతున్నది. కేసుల సంఖ్య రోజురోజుకూ తీవ్రమవుతున్నాయి. ప్రపంచ యు ద్ధాల కంటే ఈ వైరస్‌ అధిక ప్రభావం చూపుతున్నదన్న ప్రధాని నరేంద్రమోదీ.. వైరస్‌ వ్యాప్తిని అడ్డుకునేందుకు ఈ ఆదివారం ఉదయం 7 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు ‘జనతా కర్ఫ్యూ’ పాటించాలని పిలుపునిచ్చిన సంగతి తెలిసిందే. ఎవరికి వారు ఇంటి వద్దే స్వీయ నిర్బంధం పాటించడం.   గాలిలో ఈ వైరస్‌ 3 గంటలపాటు జీవిస్తుందని తాజా అధ్యయనాలు చెబుతున్నా  రాగిపై 4 గంటలు, కాటన్‌ వస్త్రంపై 12 గంటలు, కార్డ్‌బోర్డుపై 24 గంట  స్టీల్‌పై 2 నుంచి 3రోజులు, గ్లాస్‌పై 3 రోజులు, ప్లాస్టిక్‌పై 3 రోజులు ఉం  శాస్త్రవేత్తలంటున్నారు. ఈ నేపథ్యంలో జనతా కర్ఫ్యూతో వైరస్‌ వ్యాప్తి  గణనీయంగా తగ్గించే  వీలుంటుంది. ప్రధాని పిలుపునకు అన్ని వర్గాల నుం  సానుకూల స్పందన వ్యక్తమవుతున్నది. ఈ మహాయజ్ఞంలో మేము సై  అంటూ ప్రతి ఒక్కరూ ముందుకొస్తున్నారు. జనతా కర్ఫ్యూకు మద్దతివ్వాలని బాలీవుడ్‌ ప్రముఖులు షారుఖ్‌ఖాన్‌, మాధురీ దీక్షిత్‌, షాహిద్‌ కపూర్‌, మక్కల్‌ నీది మయ్యం అధ్యక్షుడు కమల్‌హాసన్‌ తదితరులు ప్రజలకు విజ్ఞప్తిచేశారు. 

గుజరాత్‌లో జనతా కర్ఫ్యూలు

జనతాకర్ఫ్యూలు గతంలోనూ జరిగాయి. మహాగుజరాత్‌ ఉద్యమం (1956-50), నవనిర్మాణ్‌ ఉద్యమం (1973-74) సమయాల్లో జనతా కర్ఫ్యూ పాటించారు. నవనిర్మాణ్‌ ఉద్యమ సమయంలో ఏబీవీపీ ప్రచారక్‌గా ఉన్న ప్రధాని మోదీ.. జనతా కర్ఫ్యూ  భాగస్వామ్యమయ్యారు. గోర్ఖాలాండ్‌ సాధన కోసం గోర్ఖా జనముక్తి మోర్చా 2013లో డార్జిలింగ్‌లో రెండు రోజుల జనతా కర్ఫ్యూకు పిలుపునిచ్చింది.

నిలిచిపోనున్న రైళ్లు

జనతా కర్ఫ్యూ సందర్భంగా ఆదివారం రైలు సర్వీసులు నిలిచిపోనున్నాయి. శనివారం అర్ధరాత్రి నుంచి ఆదివారం రాత్రి 10 గంటల వరకు ప్యాసింజర్‌ రైళ్లు పట్టాలెక్కవని రైల్వే ప్రకటించింది. ఎక్స్‌ప్రెస్‌ రైళ్లు ఆదివారం వేకువజామున 4 గంటల నుంచి నిలిచిపోనున్నాయని తెలిపింది. అయితే అప్పటికే మొదలైన రైళ్లను మాత్రం గమ్యస్థానం చేరే వరకు అనుమతించనున్నట్లు అధికారులు తెలిపారు. సబర్బన్‌ సర్వీసులనూ పూర్తిగా తగ్గించనున్నట్లు చెప్పారు. 


logo
>>>>>>