బుధవారం 28 అక్టోబర్ 2020
National - Oct 02, 2020 , 02:02:36

రేపే అటల్‌ టన్నెల్‌ ప్రారంభం

రేపే అటల్‌  టన్నెల్‌ ప్రారంభం

న్యూఢిల్లీ: సరిహద్దుల్లో వ్యూహాత్మకంగా అత్యంత కీలకమైన అటల్‌ టన్నెల్‌ను ప్రధాని మోదీ శనివారం ప్రారంభించనున్నారు. దీనిని హిమాచల్‌ప్రదేశ్‌లోని రోహ్‌తంగ్‌ పాస్‌ మీద సముద్ర మట్టానికి 10 వేల అడుగుల ఎత్తులో అత్యాధునిక సాంకేతికతతో నిర్మించారు. 

 టన్నెల్‌ విశేషాలు 

1. సొరంగం పొడవు 9.02 కిలోమీటర్లు (ప్రపంచంలోనే అత్యంత పొడవైన సొరంగ రోడ్డు మార్గం)

2. వెడల్పు 8 మీటర్లు. ప్రతీ రోజు 3వేల కార్లు, 1500 ట్రక్కులు గంటకు 80 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించేలా డిజైన్‌.

3. సముద్ర మట్టానికి 10 వేల అడుగుల ఎత్తులో నిర్మాణం

4. టన్నెల్‌లో అగ్నిప్రమాదాల నివారణకు ప్రతి 60 మీటర్లకు ఒక ఫైర్‌ హైడ్రాంట్‌.

5. ఎమర్జెన్సీ కమ్యూనికేషన్‌ కోసం టన్నెల్‌లో ప్రతి 150 మీటర్లకు ఒక టెలిఫోన్‌

6. ప్రతి 250 మీటర్లకు సీసీ కెమెరా

7. ప్రతి కిలోమీటర్‌కు గాలి నాణ్యతను కొలిచే వ్యవస్థ.


logo