శుక్రవారం 03 జూలై 2020
National - Apr 20, 2020 , 11:03:39

ప్రారంభ‌మైన టోల్ వ‌సూళ్లు

ప్రారంభ‌మైన టోల్ వ‌సూళ్లు

న్యూఢిల్లీ: కరోనా వైర‌స్ విజృంభ‌న నేప‌థ్యంలో దేశవ్యాప్తంగా నిలిచిపోయిన టోల్ చార్జీల వ‌సూళ్లు సోమ‌వారం తిరిగి ప్రారంభ‌మ‌య్యాయి. లాక్‌డౌన్ సడలింపు నేపథ్యంలో ఏప్రిల్ 20 నుంచి టోల్ వసూళ్లను తిరిగి ప్రారంభించాలని నిర్ణ‌యించిన కేంద్రం ఆ మేర‌కు ఇటీవ‌ల నేష‌న‌ల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియాకు (ఎన్‌హెచ్ఏఐ) లేఖ‌లు రాసింది. దీంతో ఎన్‌హెచ్ఏఐ ఢిల్లీ, ఉత్త‌ర‌ప్ర‌దేశ్‌, మ‌హారాష్ట్ర‌, హ‌ర్యానా, త‌మిళ‌నాడు స‌హా ప‌లు రాష్ట్రాల్లో టోల్ ప్లాజాల‌ను తెర‌చి వ‌సూళ్లు ప్రారంభించింది. 

ప్ర‌తీ రోజు న‌మ‌స్తే తెలంగాణ తాజా వార్త‌లు క‌థ‌నాలు కోసం ఈ లింక్ ను క్లిక్ చేసి .. టెలిగ్రామ్ యాప్ ను స‌బ్ స్క్రైబ్ చేసుకోగ‌ల‌రు..


logo