శనివారం 16 జనవరి 2021
National - Jan 02, 2021 , 12:01:06

నేటి స్టార్ట‌ప్‌లే రేప‌టి బ‌హుళజా‌తి కంపెనీలు: ప‌్ర‌ధాని

నేటి స్టార్ట‌ప్‌లే రేప‌టి బ‌హుళజా‌తి కంపెనీలు: ప‌్ర‌ధాని

భువ‌నేశ్వ‌ర్‌: ఒడిశాలోని ఐఐఎం-సంబ‌ల్‌పూర్ శాశ్వ‌త క్యాంప‌స్ నిర్మాణానికి ప్ర‌ధాని న‌రేంద్ర‌మోదీ శంకుస్థాప‌న చేశారు. వీడియో కాన్ఫ‌రెన్స్ ద్వారా ఆయ‌న ఈ కార్య‌క్ర‌మానికి హాజ‌ర‌య్యారు. అదేవిధంగా ఒడిశా ముఖ్య‌మంత్రి న‌వీన్ ప‌ట్నాయ‌క్‌, కేంద్ర విద్యాశాఖ మంత్రి ర‌మేశ్ పోఖ్రియాల్ త‌దిత‌రులు ఈ కార్య‌క్ర‌మంలో పాల్గొన్నారు. ఈ సంద‌ర్భంగా మాట్లాడిన ప్ర‌ధాని మోదీ.. నేటి స్టార్ట‌ప్‌లే రేప‌టి బహుళ‌జా‌తి కంపెనీల‌ని పేర్కొన్నారు. 

దేశంలోని ట‌య‌ర్-2, ట‌య‌ర్‌-3 న‌గ‌రాల్లో ఎన్నో నూత‌న స్టార్ట‌ప్‌లు పుట్టుకొస్తున్నాయ‌ని ప్ర‌ధాని తెలిపారు. వ్య‌వ‌సాయ రంగం మొద‌లు అంత‌రిక్ష రంగం వ‌ర‌కు అన్ని రంగాల్లో నూత‌న స్టార్ట‌ప్‌ల ఏర్పాటుకు రోజురోజుకు అవ‌కాశాలు పెరుగుతున్నాయ‌ని చెప్పారు. 2014లో దేశంలో కేవ‌లం 13 ఐఐఎంలు మాత్ర‌మే ఉండేవ‌ని, ఇప్పుడు ఐఐఎంల సంఖ్య మొత్తం 20కి చేరింద‌ని పేర్కొన్నారు.

ఇలాంటి విద్యాసంస్థ‌ల నుంచి వ‌చ్చే ప్ర‌తిభా స‌మూహం ఆత్మ‌నిర్భ‌ర్ భార‌త్ ప్ర‌చారం మ‌రింత బ‌లోపేతానికి తోడ్ప‌డుతుంద‌ని ప్ర‌ధాని చెప్పారు. అనంత‌రం ఒడిశా ముఖ్య‌మంత్రి న‌వీన్ ప‌ట్నాయ‌క్ మాట్లాడుతూ.. రాష్ట్రంలో వేగ‌వంత‌మైన ప‌రివ‌ర్త‌న‌కు విద్య దోహ‌ద‌ప‌డింద‌న్నారు. ఒడిశా రాష్ట్రం తూర్పు భార‌త‌దేశంలో ఎడ్యుకేష‌న్ హ‌బ్‌గా మార‌డం త‌న‌కు ఎంతో సంతోషంగా ఉంద‌ని చెప్పారు.           

లోకల్ టు గ్లోబల్.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్లో. నమస్తే తెలంగాణఆండ్రాయిడ్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.