నేటి స్టార్టప్‌లే రేపటి ఎమ్మెన్సీలు!

సంబల్పూర్: నేటి అంకుర సంస్థలే (స్టార్టప్‌లు) భవిష్యత్తులో బహుళజాతి కంపెనీలుగా అవతరిస్తాయని ప్రధాని నరేంద్రమోదీ అన్నారు. ఆత్మనిర్భర్ భారత్ కార్యక్రమ లక్ష్యం కూడా అదేనని తెలిపారు. ఒడిశాలోని సంబల్పూర్లో ఉన్న ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ (ఐఐఎం) శాశ్వత క్యాంపస్ నిర్మాణానికి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రధాని శనివారం శంకుస్థాపన చేశారు. ‘ఆత్మనిర్భర్ భారత్‌కు మేనేజ్మెంట్ రంగంలో ఆవిష్కరణ, సమగ్రత, సమ్మిళితత్త్వాలే అత్యంత కీలకం. భారత్ స్వయం సమృద్ధి సాధించేందుకు మేనేజ్మెంట్ రంగంలో సహకారం, ఆవిష్కరణలు, పరివర్తన కీలకం’ అని ప్రధాని పేర్కొన్నారు. 2014 వరకు దేశంలో 13 ఐఐఎంలు మాత్రమే ఉండేవని.. ప్రస్తుతం 20 ఉన్నాయని చెప్పారు.
మోదీకి అత్యధిక జనాదరణ
న్యూఢిల్లీ: ప్రపంచ నాయకులందరిలో ప్రధాని మోదీకే ఎక్కువ జనాదరణ (55%) ఉందని అమెరికా సంస్థ ‘మార్నింగ్ కన్సల్ట్' సర్వే పేర్కొన్నది. బీజేపీ అధ్యక్షుడు జేపీ నడ్డా ఈ విషయాన్ని ట్వీట్ చేస్తూ ..ఇది మోదీ సమర్థవంతమైన నాయకత్వానికి నిదర్శమని, భారతీయులందరికీ గర్వకారణమని అన్నారు. ఈ సర్వేలో బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్‌కు ‘నెగెటివ్' మార్కులు పడ్డాయి.
తాజావార్తలు
- ధోనీని మించిన రిషబ్ పంత్.. కొత్త రికార్డు
- ఆదిలాబాద్ జిల్లాలో విషాదం.. ప్రేమజంట ఆత్మహత్య
- 24 గంటల్లో 10064 మందికి కరోనా పాజిటివ్
- వీడియో : వాసన చూడండి..బరువు తగ్గండి
- వరుణ్ తేజ్ మూవీకి ఆసక్తికరమైన టైటిల్.. ఫస్ట్ లుక్ విడుదల
- కాళేశ్వరం పర్యటనకు బయల్దేరిన సీఎం కేసీఆర్
- కావాల్సినవి 145 పరుగులు.. చేతిలో 7 వికెట్లు
- కరోనాతో సీపీఎం ఎమ్మెల్యే మృతి
- వ్యాక్సిన్ పంపిణీపై డబ్ల్యూహెచ్‌వో అసంతృప్తి
- వీడియో : అదిరింది..మోగింది