శనివారం 04 ఏప్రిల్ 2020
National - Mar 23, 2020 , 13:51:10

ఇక‌పై వీడియో కాన్ఫ‌రెన్స్ ద్వారా వాద‌న‌లు : సుప్రీంకోర్టు

ఇక‌పై వీడియో కాన్ఫ‌రెన్స్ ద్వారా వాద‌న‌లు : సుప్రీంకోర్టు

న్యూఢిల్లీ : దేశంలో క‌రోనా వైర‌స్ ను క‌ట్ట‌డి చేసేందుకు కేంద్ర‌, రాష్ట్ర ప్ర‌భుత్వాలు ఎప్ప‌టిక‌ప్పుడు అప్ర‌మ‌త్తంగా వ్య‌వ‌హ‌రిస్తున్నాయి. కేంద్ర ప్ర‌భుత్వం దేశ‌వ్యాప్తంగా 75 జిల్లాల్లో లాక్‌డౌన్ విధించ‌గా.. తెలంగాణ స‌హా ప‌లు రాష్ట్రాల ప్ర‌భుత్వాలు ఆయా రాష్ట్రాల్లో లాక్‌డౌన్‌ను అమ‌ల్లోకి తెచ్చాయి. ఈ నేప‌థ్యంలోనే సుప్రీంకోర్టు కూడా కీల‌క నిర్ణ‌యం తీసుకుంది. ఇక నుంచి సుప్రీంకోర్టు న్యాయ‌వాదులు వీడియో కాన్ఫ‌రెన్స్ ద్వారా త‌మ వాద‌న‌లు వినిపించాల‌ని సూచించింది.

ఇక‌పై న్యాయ‌వాదులు నేరుగా కోర్టుకు వ‌చ్చి వాదించాల్సిన అవ‌స‌రం లేద‌ని, అత్య‌వ‌స‌ర కేసులకు సంబంధించి న్యాయ‌వాదులు వీడియో కాన్ఫ‌రెన్స్ ద్వారానే త‌మ వాద‌న‌లు వినిపించాల‌ని సుప్రీంకోర్టు ప్ర‌ధాన న్యాయ‌మూర్తి జ‌స్టిస్ ఎస్ఏ బోబ్డే పేర్కొన్నారు. ఈ మేర‌కు అన్ని ఏర్పాట్లు చేస్తున్నామ‌ని, న్యాయ‌వాదుల‌కు కొన్ని లింకులు ఇస్తామ‌ని, ఆ లింకుల ద్వారా వీడియో కాల్స్‌ క‌నెక్ట్ చేసుకోవ‌చ్చ‌ని సీజేఐ తెలిపారు. స్కైప్ ద్వారాగానీ, మ‌రేఇత‌ర సాధ‌నాల ద్వారాగానీ లాయ‌ర్లు త‌మ వాద‌న‌లు వినిపించ‌వ‌చ్చ‌ని సుప్రీంకోర్టు పేర్కొంది. 

ఇదిలావుంటే, కోర్టు భ‌వ‌నంలోని లాయ‌ర్ల చాంబ‌ర్లు అన్నింటిని సోమ‌వారం సాయంత్రం 5 గంట‌ల నుంచి మూసివేయాల‌ని స‌ర్వోన్న‌త న్యాయ‌స్థానం ఆదేశించింది. ఇప్ప‌టికే న్యాయ‌వాదుల ఎల‌క్ట్రానిక్ పాసుల‌ను కూడా ర‌ద్దుచేసిన సుప్రీంకోర్టు..  కోర్టులో లాయ‌ర్ల‌కు సంబంధించిన ముఖ్య‌మైన డాక్యుమెంట్లు ఏవైనా ఉంటే మంగ‌ళ‌వారం సాయంత్రానిక‌ల్లా తీసుకెళ్లాల‌ని సూచించింది.   


logo