ఆదివారం 05 జూలై 2020
National - Jun 25, 2020 , 14:23:58

ఆ రోజు దేశ చ‌రిత్రో ఓ దుర్దినం: ‌కేంద్ర‌మంత్రి

ఆ రోజు దేశ చ‌రిత్రో ఓ దుర్దినం: ‌కేంద్ర‌మంత్రి

న్యూఢిల్లీ: 1975, జూన్ 25 దేశ చరిత్ర‌లో ఒక దుర్దిన‌మ‌ని కేంద్ర స‌మాచార, ప్ర‌సార శాఖ‌ల మంత్రి ర‌విశంక‌ర్ ప్ర‌సాద్ వ్యాఖ్యానించారు. నాటి ప్ర‌ధాని ఇందిరాగాంధీ త‌న ప‌ద‌విని కాపాడుకోవ‌డం కోసం 1975, జూన్ 25న దుర్మార్గ‌పూరిత నిర్ణ‌యం తీసుకున్నార‌ని ఆయ‌న విమ‌ర్శించారు. దేశంలో ఎమ‌ర్జెన్సీ విధించి అరాచ‌క పాల‌న సాగించార‌ని చెప్పారు. రాయ్‌బ‌రేలీ లోక్‌స‌భ నియోజ‌క‌వ‌ర్గం నుంచి ఇందిరాగాంధీ ఎన్నిక చెల్ల‌దని అల‌హాబాద్ హైకోర్టు ఇచ్చిన తీర్పు నేప‌థ్యంలో ఇందిరాగాంధీ అమానుష‌మైన నిర్ణ‌యం తీసుకున్నార‌ని ర‌విశంక‌ర్ ప్ర‌సాద్ గుర్తుచేశారు. 

1971 లోక్‌స‌భ ఎన్నిక‌ల్లో ఇందిరాగాంధీ రాయ్‌బ‌రేలీ నియోజ‌క‌వ‌ర్గం నుంచి విజ‌యం సాధించారు. అయితే, పోలింగ్ సంద‌ర్భంగా ఇందిరాగాంధీ అవ‌క‌త‌వ‌క‌ల‌కు పాల్ప‌డ్డార‌ని, అడ్డ‌దారిలో గెలువ‌డం కోసం అధికార యంత్రాంగాన్ని దుర్వినియోగం చేశార‌ని, ఆమె ఎన్నిక‌ల‌ను ర‌ద్దు చేయాల‌ని కోరుతూ రాయ్‌బ‌రేలీలో ఇందిరాగాంధీ చేతిలో ఓడిపోయిన‌ రాజ్ నారాయ‌ణ్ అల‌హాబాద్ హైకోర్టులో పిటిష‌న్ వేశారు. దీనిపై 1975, జూన్ 12 తీర్పు వెల్ల‌డించిన కోర్టు ఇందిరాగాంధీ ఎన్నిక‌ల చెల్ల‌ద‌ని పేర్కొంది. 

దీంతో ఇందిరాగాంధీ అల‌హాబాద్ హైకోర్టు తీర్పును స‌వాల్ చేస్తూ సుప్రీంకోర్టును ఆశ్ర‌యించింది. అయితే ఆ పిటిష‌న్‌పై విచార‌ణ జ‌రిపిన దేశ స‌ర్వోన్న‌త న్యాయ‌స్థానం తీర్పును పెండింగ్‌లో పెట్టి, ఇందిరాగాంధీ ప్ర‌ధానిగా కొన‌సాగడానికి అవ‌కాశం ఇచ్చింది. దీంతో జ‌న‌తాపార్టీకి చెందిన జ‌య‌ప్ర‌కాశ్ నారాయ‌ణ్‌, మొరార్జీదేశాయ్‌లు దేశ‌వ్యాప్తంగా ఆందోళ‌న‌ల‌కు పిలుపునిచ్చారు. దీంతో దేశం మొత్తం ఆందోళ‌న‌లు వెల్లువెత్తాయి. ఈ నేప‌థ్యంలో ఇందిరాగాంధీ దేశంలో ఎమ‌ర్జెన్సీ విధించి ఆందోళ‌న‌ల‌ను అణిచివేశారు.    

   


logo