శనివారం 26 సెప్టెంబర్ 2020
National - Aug 08, 2020 , 16:13:55

నేడు చెళ్లపిళ్ల జయంతి.. నివాళులర్పించిన వెంకయ్య

నేడు చెళ్లపిళ్ల జయంతి.. నివాళులర్పించిన వెంకయ్య

న్యూఢిల్లీ : తిరుపతి వేంకట కవుల్లో ఒకరైన చెళ్లపిళ్ల వేంకటశాస్త్రి జయంతి సందర్భంగా ఆ పుంభావ సరస్వతి స్మృతికి ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు నివాళులు అర్పించారు.  దివాకర్ల తిరుపతిశాస్త్రితో కలిసి జంట కవులుగా వారు చేసిన సాహితీ సేద్యం, అవధాన యాత్ర ఎందరికో స్ఫూర్తిని పంచాయని కొనియాడారు.

తిరుపతి వెంకట కవుల “బావా.. ఎప్పుడు వచ్చితీవు, చెల్లియో చెల్లకో, జెండా పై కపిరాజు” వంటి పాండవోద్యోగ నాటక పద్యాలు తెలియని తెలుగు వారు అరుదని, వారి సాహితీ గరిమకు నిదర్శనంగా  అవి నేటికీ పండిత, పామరుల నాల్కల మీద మార్మ్రోగుతూనే ఉన్నాయని వెంకయ్య ట్విట్టర్ లో పోస్ట్ చేశారు.logo