సోమవారం 10 ఆగస్టు 2020
National - Jul 29, 2020 , 16:12:09

నేడు అంతర్జాతీయ పులుల దినోత్సవం.. 12 ఏండ్లలో పులుల సంఖ్య రెట్టింపైంది

నేడు అంతర్జాతీయ పులుల దినోత్సవం.. 12 ఏండ్లలో పులుల సంఖ్య రెట్టింపైంది

న్యూ ఢిల్లీ : నేడు అంతర్జాతీయ పులుల దినోత్సవం. కేంద్ర మంత్రి ప్రకాశ్‌ జవదేకర్ నివేదిక ప్రకారం 12 ఏండ్లలో పులుల సంఖ్య రెట్టింపు అయ్యింది. "1973లో కేవలం 9 పులులు మాత్రమే ఉండేవి. ప్రస్తుతం వాటి సంఖ్య భారీగా పెరిగిందని, ఉత్తమ జాతికి చెందిన పులులు ప్రస్తుతం దేశంలో ఉన్నాయని’’ ప్రకాశ్‌ జవదేకర్ అన్నారు.

టైగర్స్, కో-ప్రెడేటర్స్, ప్రే ఇన్ ఇండియా నివేదిక ప్రకారం.. భారతదేశంలో మొత్తం 2014లో పులుల సంఖ్య 1400గా ఉండగా ప్రస్తుతం 2,967గా ఉంది. అంచనాల ప్రకారం ప్రపంచ వ్యాప్తంగా ఉన్న పులుల్లో 75 శాతం భారతదేశంలోనే ఉన్నాయి. దేశంలో అత్యధిక సంఖ్యలో పులులు ఉత్తరాఖండ్‌లోని ప్రసిద్ధ వన్యప్రాణుల అభయారణ్యం జిమ్ కార్బెట్‌లో ఉన్నాయి. ఇక్కడ సుమారు 231 ఉన్నట్లు అటవీ అధికారులు తెలిపారు. ఆ తరువాతి స్థానంలో కర్ణాటకలోని నాగర్‌హోల్ ఉంది. అక్కడ 127 పులులున్నాయి. పులులను అందమైన, భయంకర జంతువుల్లో ఒకటిగా చూస్తారు. 


పులుల గురించి తెలియని కొన్ని విషయాలు

 • ఇతర అడవి పిల్లులతో పోలిస్తే పులులు అతిపెద్దవి
 • పులి సరిగ్గా పంజా విసిరితే ప్రాణాలు గాల్లో కలిసినట్లే
 • ఇవి అధికంగా రాత్రిపూటే సంచరిస్తాయి
 • వీటి పిల్లలు గుడ్డిగా పుడతాయి, పిల్లల్లో సగం మాత్రమే మనుగడ సాధిస్తాయి
 • నీటిలో ఈత కొట్టడానికి, ఆడటానికి ఇవి ఇష్టపడతాయి
 • పులుల జీవిత కాలం సుమారు 25 సంవత్సరాలు
 • టైగర్స్ సమూహాన్ని స్ట్రీక్ అంటారు
 • పులులు ఇతర పెద్ద పులులతో కలిసిపోతాయి
 • పులిలో క్రిమినాశక లాలాజలం ఉంటుంది
 • ఇవి గంటకు 60 కి.మీ వేగంతో దూసుకుపోతాయి
 • పులులు చాలా అరుదుగా గర్జిస్తాయి, గంపులో అవి వినయంగా ఉంటాయి
 • ఆకస్మికంగా వేటాడటాన్ని ఇష్టపడతాయి
 • పులులు ఒంటరి జీవులు
 • ఇవి ఇతర జంతువుల పిలుపును అనుకరించగలవు
 • పులులు సాధారణంగా మానవులను వేటాడే జీవిగా చూడవు
 • పులి పురుషాంగం ప్రేరేపించినప్పుడు నిటారుగా నిలబడదు

లోక‌ల్ టు గ్లోబ‌ల్‌.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. న‌మ‌స్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


logo