e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Thursday, October 21, 2021
Home జాతీయం నేడు భారత్‌ బంద్‌

నేడు భారత్‌ బంద్‌

  • సంయుక్త కిసాన్‌ మోర్చా పిలుపు
  • విపక్షాలు, పలు సంఘాల మద్దతు
  • కొత్త సాగు చట్టాలకు నేటితో ఏడాది

న్యూఢిల్లీ: కేంద్రం తీసుకువచ్చిన వివాదాస్పద వ్యవసాయ చట్టాలకు రాష్ట్రపతి ఆమోదం తెలిపి సోమవారానికి (సెప్టెంబర్‌ 27) ఏడాది. ఈ సందర్భంగా 40 రైతుల సంఘాల ఉమ్మడి వేదికైన సంయుక్త కిసాన్‌ మోర్చా (ఎస్‌కేఎం) దేశవ్యాప్త బంద్‌కు పిలుపునిచ్చింది. రాజకీయ పార్టీలు, ప్రజా సంఘాలు, ప్రజల మద్దతు కోరింది. బంద్‌ సోమవారం ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు జరుగుతుందని ఎస్‌కేఎం తెలిపింది. దీనికి దేశవ్యాప్తంగా పలు రాజకీయ పార్టీలు మద్దతు ప్రకటించాయి. దేశవ్యాప్తంగా నిరసన కార్యక్రమాలు చేపడతామని కాంగ్రెస్‌ తెలిపింది. బంద్‌కు తమ పూర్తి మద్దతు ఉంటుందని పంజాబ్‌ సీఎం చరణ్‌జీత్‌ సింగ్‌ చన్నీ ప్రకటించారు. ఆంధ్రప్రదేశ్‌, కేరళ, తమిళనాడు ప్రభుత్వాలు కూడా బంద్‌కు మద్దతిస్తామని తెలిపాయి. బంద్‌కు ఆల్‌ ఇండియా బ్యాంక్‌ ఆఫీసర్స్‌ కాన్ఫెడెరేషన్‌ కూడా మద్దతు ప్రకటించింది. బంద్‌ దృష్ట్యా ఢిల్లీలో భద్రతను కట్టుదిట్టం చేశారు. రాజధాని సరిహద్దుల్లో అదనపు బలగాలను
మోహరించారు.

- Advertisement -
- Advertisement -
Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement

ట్రెండింగ్‌

Advertisement