సోమవారం 10 ఆగస్టు 2020
National - Jul 31, 2020 , 09:43:38

క‌రోనాను జ‌యించిన మంత్రి.. నిబంధ‌న‌లు ఉల్లంఘించి స్వాగ‌తం

క‌రోనాను జ‌యించిన మంత్రి.. నిబంధ‌న‌లు ఉల్లంఘించి స్వాగ‌తం

చెన్నై : త‌మిళ‌నాడు మంత్రి, అన్నాడీఎంకే నాయ‌కుడు సెల్లూరు రాజు క‌రోనా మ‌హ‌మ్మారిని జ‌యించారు. దీంతో గురువారం చెన్నైలోని ఎంఐవోటీ ఆస్ప‌త్రి నుంచి రాజు డిశ్చార్జి అయ్యారు. త‌మ నాయ‌కుడు క‌రోనాను జ‌యించాడ‌న్న ఆనందంతో.. ఆయ‌న మ‌ద్ద‌తుదారులు సంబురాల్లో మునిగితేలారు. కానీ లాక్‌డౌన్ నిబంధ‌న‌లు ఉల్లంఘించారు. మంత్రి కాన్వాయ్ ముందు ప‌టాకులు పేల్చారు. రాజు కారు వ‌ద్ద ఆయ‌న‌ను క‌లిసేందుకు గుమిగూడారు. సెల్ఫీలు తీసుకునేందుకు ఎగ‌బ‌డ్డారు. క‌నీసం సామాజిక దూరం పాటించ‌లేదు. మాస్కులు కూడా ధ‌రించ‌కుండా స్వాగ‌తం ప‌లక‌డంపై స‌ర్వ‌త్రా విమ‌ర్శ‌లు ఎదుర‌వుతున్నాయి. క‌రోనా వ్యాప్తి అధికంగా ఉన్న నేప‌థ్యంలో త‌మిళ‌నాడులో లాక్‌డౌన్‌ను ఆగ‌స్టు 31 వ‌ర‌కు పొడిగించిన విష‌యం విదిత‌మే. 

త‌మిళ‌నాడులో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య‌ 2,39,978కు చేరింది. ఇందులో యాక్టివ్ కేసుల సంఖ్య 57,959. ఈ మ‌హ‌మ్మారి నుంచి 1,78,178 మంది కోలుకోగా, 3,841 మంది ప్రాణాలు కోల్పోయారు.


logo