శనివారం 06 జూన్ 2020
National - May 14, 2020 , 12:02:26

కోవిడ్ చికిత్స కోసం 4 ర‌కాల ఆయుర్వేద ఔష‌ధాల ట్ర‌య‌ల్స్‌

కోవిడ్ చికిత్స కోసం 4 ర‌కాల ఆయుర్వేద ఔష‌ధాల ట్ర‌య‌ల్స్‌

హైద‌రాబాద్‌: క‌రోనా వైర‌స్ చికిత్స కోసం నాలుగు ర‌కాల ఆయుర్వేద ఔష‌ధాల‌కు ట్ర‌య‌ల్స్ నిర్వ‌హిస్తున్న‌ట్లు కేంద్ర‌ ఆయుష్ శాఖ మంత్రి శ్రీప‌ద్ నాయిక్ ట్వీట్ చేశారు.  సాంప్ర‌దాయ ఔష‌ధాల‌తో చికిత్స అందించేందుకు ఆయుష్ మంత్రిత్వ‌శాఖ ప‌నిచేస్తున్న విష‌యం తెలిసిందే. ఆయుర్వేదం, యోగా, యునాని, సిద్ధ‌, హోమియోప‌తి ఈ శాఖ‌లో ఉన్నాయి. అయితే కోవిడ్‌19 చికిత్స కోసం నాలుగు ఔష‌ధాల‌ను త‌యారు చేస్తున్నామ‌ని, వాటికి మ‌రో వారంలో ట్ర‌య‌ల్స్ ప్రారంభిస్తామ‌ని మంత్రి శ్రీప‌ద్ తెలిపారు.  మ‌హ‌మ్మారి క‌రోనాను తరిమేందుకు సాంప్ర‌దాయ వైద్య ప‌ద్ధ‌తులు మంచి ఫ‌లితాలు ఇస్తాయ‌ని ఆశాజ‌న‌కంగా ఉన్న‌ట్లు మంత్రి తెలిపారు. 


logo