న్యూఢిల్లీ, జూలై 28: బెల్జియన్-బ్రిటిషర్ జరా రూథర్ఫర్డ్(19) ప్రపంచాన్ని చుట్టి రావడానికి ఆగస్టు 11న ఒంటరిగా బయల్దేరనున్నారు. తద్వారా అతి పిన్న వయస్సులో, ఒంటరిగా ప్రపంచాన్ని చుట్టి వచ్చిన అమ్మాయిగా రికార్డు సృష్టించనున్నారు. తన సొంత షార్క్ అల్ట్రాలైట్ ప్లేన్లో ఆమె ప్రపంచాన్ని చుట్టిరావడానికి బయల్దేరతారు.