స్వాతిరెడ్డి, శివాత్మిక రాజశేఖర్, రాహుల్ విజయ్, నరేష్ అగస్త్య ప్రధాన పాత్రల్లో నటిస్తున్న చిత్రం ‘పంచతంత్రం’. హర్ష పులిపాక దర్శకుడు. అఖిలేష్వర్ధన్, సృజన్ ఎరబోలు నిర్మాతలు. బ్రహ్మానందం, సముద్రఖని కీలక పాత్రల్ని పోషిస్తున్నారు. నరేష్ అగస్త్య పుట్టినరోజును పురస్కరించుకొని అతడి ఫస్ట్లుక్పోస్టర్ను చిత్రబృందం ఇటీవల విడుదలచేసింది. నిర్మాతలు మాట్లాడుతూ ‘విహారి అనే సాఫ్ట్వేర్ ఇంజినీర్‌గా నరేష్ అగస్త్య కనిపిస్తారు. వృత్తికి, వ్యక్తిగతజీవితానికి మధ్య సంఘర్షణకు లోనయ్యే యువకుడిగా అతడి పాత్ర ఆసక్తికరంగా సాగుతుంది. నేటి యువతకు ప్రతిబింబంగా ఉంటుంది’ అని తెలిపారు. ఈ చిత్రానికి సినిమాటోగ్రఫీ: రాజ్ కె నల్లి, సంగీతం: ప్రశాంత్ ఆర్ విహారి.