బుధవారం 12 ఆగస్టు 2020
National - Jul 20, 2020 , 16:19:17

ఆర్థిక సాయానికి ప్రధాని మోడీ, సీఎం యోగిలకు జిల్లా బ్యాడ్మింటన్ ఛాంపియన్ వినతి

ఆర్థిక సాయానికి ప్రధాని మోడీ, సీఎం యోగిలకు జిల్లా బ్యాడ్మింటన్ ఛాంపియన్ వినతి

లక్నో : కరోనా మహమ్మారి కారణంగా ఆర్థిక ఇబ్బందులు ఎదుకుంటున్న తన కుటుంబాన్ని ఆదుకోవాలని ప్రధాని నరేంద్ర మోడీ, సీఎం యోగి ఆదిత్యనాథ్లకు విజ్ఞప్తి చేస్తుంది ఉత్తర ప్రదేశ్‌కు చెందిన జిల్లా బ్యాడ్మింటన్ ఛాంపియన్ రాథ ఠాకూర్. కుటుంబ ఆర్థిక సమస్యలను ఎదురుకునేందుకు తను సాధించిన మెడల్స్‌ను సైతం విక్రయించేందుకు సిద్ధపడింది. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ  ‘నేను ఏడుసార్లు జిల్లా ఛాంపియన్‌గా గెలుపొందాను. ప్రధాని మోడీ, సీఎం యోగి ఆదిత్యనాథ్‌ ఎల్లప్పుడు మహిళా సాధికారత కోసం పిలుపునిస్తుంటారు. వారు నిజంగా మాకు సాయం చేస్తారని నేను నమ్ముతున్నాను. మా దుస్థితిని గమనించమని వారిని కోరుతున్నారు. నాకు మీ సాయం కావాలి’ అని రాథ ఠాకూర్‌ వేడుకుంది.  

తన కుటుంబ ఆర్థిక పరిస్థితి గురించి మాట్లాడుతూ ‘లాక్‌డౌన్‌ సమయంలో నా తండ్రి, సోదరుడు ఉద్యోగాలు కోల్పోయారు. దీంతో మా కుటుంబానికి ఆదాయం లేకుండా పోయింది. మాకు అప్పు ఇవ్వడానికి ఇవ్వడానికి ఎవరూ ముందుకు రావడం లేదు. దీంతో చేసేదేమిలేక నేను గెలుపొందిన మెడల్స్‌ను అమ్మాలని నిర్ణయించుకున్నాను. దీంతో నాకు 1,000 నుంచి 2,000 రూపాయలు వస్తాయి. వాటితో నా కుటుంబానికి రెండు రోజులకు సరిపడా భోజనం మాత్రమే లభిస్తుంది" అని చెప్పింది. 

బ్యాడ్మింటన్ ఆడుతున్నప్పుడు తాను ఎన్నో సమస్యలను ఎదుర్కొన్నానని తెలిపాంది. ‘ప్రతి టోర్నమెంట్‌కు నాకు 5000 నుంచి 6000 రూపాయలు ఖర్చు అయ్యేవి.  నా కుటుంబ సభ్యులు ఏదో ఒక విధంగా ఆ డబ్బును సమకూర్చేవారు. నా తండ్రి ఒక కార్మికుడు. ఆర్థికంగా ఇబ్బందులు ఉన్నప్పటికీ వారు నన్ను ప్రోత్సహించేవారు’ అని చెప్పింది. ఉత్తరప్రదేశ్ తరఫున మూడుసార్లు ఆడానని రాథ ఠాకూర్ తెలిపింది.  ఇప్పుడు కూడా ఆడాల్సి ఉండగా కరోనా కారణంగా టోర్నమెంట్ వాయిదా పడింది చెప్పింది.  

మా కుటుంబం చాలా సమస్యలను ఎదుర్కొంది, కానీ మేము నా కుమార్తె కలలకు మద్దతు నిలిచామని చెప్పింది రాథ తల్లి బినేష్ దేవి. ‘మేము  రాథ ఎదుగుదలకు మా వంతుగా సాయం చేశాం. నువ్వు వెళ్లి ఆడుకో.. మిగతావన్నీ మేము చూసుకుంటాం’ అని చెప్పేవాళ్లమని ఆమె వివరించింది.


లోకల్ టు గ్లోబల్.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్లో. నమస్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డోన్లోడ్ చేసుకోండి.


logo