మంగళవారం 14 జూలై 2020
National - Jun 26, 2020 , 18:19:49

త‌మిళ‌నాడులో కొత్త‌గా 3,523 కేసులు.. 46 మంది మృతి

త‌మిళ‌నాడులో కొత్త‌గా 3,523 కేసులు.. 46 మంది మృతి

చెన్నై : క‌రోనా పాజిటివ్ కేసుల‌తో త‌మిళ‌నాడు రాష్ర్టం అత‌లాకుత‌లం అవుతోంది. త‌మిళ‌నాడులో రోజురోజుకు పాజిటివ్ కేసులు అధిక‌మ‌వుతున్నాయి. దీంతో త‌మిళ ప్ర‌జ‌లు తీవ్ర ఆందోళ‌న‌కు గుర‌వుతున్నారు.  గ‌డిచిన 24 గంట‌ల్లో కొత్త‌గా 3,523 పాజిటివ్ కేసులు న‌మోదు కాగా, మ‌రో 46 మంది ప్రాణాలు కోల్పోయారు. త‌మిళ‌నాడులో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 74,622కు చేరుకోగా, మృతుల సంఖ్య 957కు చేరింది. యాక్టివ్ కేసుల సంఖ్య 32,305. 

చెన్నైలో అత్య‌ధికంగా 47,650, చెంగ‌ల్ ప‌ట్టులో 4,407, తిరువ‌ల్లూరులో 3,085, కంచీపురంలో 1488, తిరువ‌న్న‌మ‌లైలో 1428 పాజిటివ్ కేసులు న‌మోదు అయ్యాయి.


logo