సోమవారం 03 ఆగస్టు 2020
National - Jul 08, 2020 , 16:48:13

విద్యుత్ శాఖ మంత్రికి క‌రోనా పాజిటివ్

విద్యుత్ శాఖ మంత్రికి క‌రోనా పాజిటివ్

చెన్నై : త‌మిళ‌నాడులో క‌రోనా వైర‌స్ విజృంభ‌ణ కొన‌సాగుతూనే ఉంది. తాజాగా అన్నాడీఎంకే సీనియ‌ర్ లీడ‌ర్, విద్యుత్ శాఖ మంత్రి పీ తంగ‌మ‌ణికి క‌రోనా పాజిటివ్ నిర్ధార‌ణ అయింది. దీంతో చికిత్స నిమిత్తం చెన్నైలోని ఓ ప్ర‌యివేటు ఆస్ప‌త్రిలో చేరారు. 

ఇటీవ‌లే ఉన్న‌త విద్యాశాఖ మంత్రి కేపీ అన్బాల‌గ‌న్ కు క‌రోనా సోకింది. ఇద్ద‌రు మంత్రుల‌తో పాటు ఎమ్మెల్యేలు కే ప‌ళ‌ని(శ్రీపెరంబుదూర్), అమ్మ‌న్ కే అర్జున్(కొయంబ‌త్తూర్ సౌత్), ఎన్ స‌త్తాన్ ప్ర‌భాక‌ర్(ప‌ర‌మ‌కుడి), కుమార‌గురు(ఉలుందుర్ పేట‌)కు క‌రోనా పాజిటివ్ నిర్ధార‌ణ అయింది. అన్నాడీఎంకే సీనియ‌ర్ నాయ‌కులు, మాజీ మంత్రి బీ వ‌ల‌ర్మ‌తి క‌రోనాతో ఓ ప్ర‌యివేటు ఆస్ప‌త్రిలో చేరారు. 

న‌లుగురు డీఎంకే ఎమ్మెల్యేలు.. కేఎస్ మ‌స్తాన్, ఆర్టీ ఆర‌సు, వ‌సంతం కే కార్తీకేయ‌న్, జే అన్ బ‌జ్హ‌గ‌న్ కు క‌రోనా సోకింది. అయితే అన్ బ‌జ్హ‌గ‌న్ క‌రోనాతో గ‌త నెల‌లో ప్రాణాలు కోల్పోయారు. 

త‌మిళ‌నాడులో ఇప్ప‌టి వ‌ర‌కు 1,18,594 పాజిటివ్ కేసులు న‌మోదు కాగా, 1,636 మంది మృతి చెందారు. మొత్తం పాజిటివ్ కేసుల్లో 45,842 యాక్టివ్ కేసులు ఉన్నాయి. 71,116 మంది ఈ వైర‌స్ నుంచి కోలుకున్నారు. 


logo