గురువారం 04 మార్చి 2021
National - Jan 20, 2021 , 10:09:34

తృణమూల్‌ కాంగ్రెస్‌ కార్యాలయంపై దాడి.. ఇదరు కార్యకర్తలు మృతి

తృణమూల్‌ కాంగ్రెస్‌ కార్యాలయంపై దాడి.. ఇదరు కార్యకర్తలు మృతి

కోల్‌కతా : పశ్చిమబెంగాల్‌లోని దక్షిణ దినాజ్‌పూర్‌లోని అధికార తృణమూల్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంపై గుర్తు తెలియని వ్యక్తులు దాడి చేశారు. ఈ ఘటనలో ఆ పార్టీకి చెందిన ఇద్దరు కార్యకర్తలు మృత్యువాతపడ్డారు. హత్య ఘటనతో సంబంధం ఉన్న ఆరుగురు వ్యక్తులను అదుపులోకి తీసుకున్నామని, కేసు దర్యాప్తు చేస్తున్నట్లు దక్షిణ సౌత దినాజ్‌పూర్‌ ఎస్పీ దేబర్షి దత్తా తెలిపారు. మరో ఘటనలో పుర్బా బర్దామన్‌ జిల్లాలో బీజేపీ, టీఎంసీ కార్యకర్తల మధ్య ఘర్షణ జరిగింది. ఇందులో ఇద్దరు బీజేపీ కార్యకర్తలు గాయపడ్డారు. పశ్చిమబెంగాల్ రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో వాతావరణం వేడెక్కింది. అధికార తృణమూల్‌, ప్రతిపక్ష బీజేపీ కార్యకర్తలు దాడులు చేసుకుంటున్నారు. దీంతో బెంగాల్‌లో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.

VIDEOS

logo