సోమవారం 18 జనవరి 2021
National - Dec 30, 2020 , 13:40:59

గ‌వ‌ర్న‌ర్‌ను త‌క్ష‌ణ‌మే తొల‌గించండి.. రాష్ట్ర‌ప‌తికి ఎంపీల మెమొరాండం

గ‌వ‌ర్న‌ర్‌ను త‌క్ష‌ణ‌మే తొల‌గించండి.. రాష్ట్ర‌ప‌తికి ఎంపీల మెమొరాండం

కోల్‌క‌తా: ప‌శ్చిమ‌బెంగాల్‌లో అధికార తృణ‌మూల్ కాంగ్రెస్ పార్టీకి, గ‌వ‌ర్న‌ర్ జ‌గ‌దీప్ ధ‌న్‌క‌ర్‌కు మ‌ధ్య వివాదం మ‌రింత ముదిరింది. అదీ ఎంత‌లా అంటే గ‌వ‌ర్న‌ర్‌, టీఎంసీ ఎంపీలు ఒక‌రిపై ఒక‌రు దూష‌ణ‌లు చేసుకునే వ‌ర‌కు వ్య‌వ‌హారం వెళ్లింది. ఈ నేప‌థ్యంలో గ‌వ‌ర్న‌ర్ జ‌గ‌దీప్ ధ‌న్‌క‌ర్‌ను వెంట‌నే ఆ ప‌ద‌వి నుంచి త‌ప్పించాలంటూ తృణ‌మూల్ ఎంపీలు రాష్ట్ర‌ప‌తి రామ్‌నాథ్ కోవింద్‌కు మెమొరాండం స‌మ‌ర్పించారు. 

టీఎంసీ ఎంపీ సుఖేందు శేఖ‌ర్ రాయ్ పేరుతో రాష్ట్ర‌ప‌తికి పంపిన ఈ మెమొరాండంపై ఇత‌ర టీఎంసీ ఎంపీలు సుదీప్ బంధోపాధ్యాయ్‌, డెరెక్ ఓబ్రియాన్‌, క‌ళ్యాణ్ బెనెర్జి, ఎంపీ క‌కోలి ఘోష్ ద‌స్తిదార్ సంత‌కాలు చేశారు. కాగా, రాష్ట్రంలో రాజ్యాంగ విలువ‌ల‌ను కాపాడటంలో గ‌వ‌ర్న‌ర్ ధ‌న్‌క‌ర్ పూర్తిగా విఫ‌ల‌మ‌య్యార‌ని, ఆయ‌న‌ ప‌దేప‌దే చ‌ట్టాల‌ను ఉల్లంఘించార‌ని త‌మ మెమొరాండంలో పేర్కొన్న‌ట్లు ఎంపీలు తెలిపారు.     

లోకల్ టు గ్లోబల్.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్లో. నమస్తే తెలంగాణఆండ్రాయిడ్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.