శనివారం 08 ఆగస్టు 2020
National - Jul 15, 2020 , 13:27:10

రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్‌తో టీఎంసీ ఎంపీ భేటీ

రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్‌తో టీఎంసీ ఎంపీ భేటీ

న్యూఢిల్లీ: పశ్చిమ బెంగాల్‌కు చెందిన తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ డెరెక్ ఓబ్రియన్ ఆధ్వర్యంలో ఆ పార్టీ ప్రతినిధుల బృందం రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్‌‌ను బుధవారం రాష్ట్రపతి భవన్‌లో కలిసింది. బీజేపీ ఎమ్మెల్యే దేబేంద్రనాథ్ రే ఆత్మహత్య ఘటనపై సీఎం మమతా బెనర్జీ రాసిన లేఖను ఎంపీ డెరెక్ ఓబ్రియన్ రాష్ట్రపతికి అందజేశారు. బిందాల్‌లోని తన నివాసంలో దేబేంద్రనాథ్ మృతదేహం వేలాడుతూ కనిపించింది. అధికార టీఎంసీ, బీజేపీ మధ్య రాష్ట్రంలో ఘర్షణ వైఖరి నెలకొన్న నేపథ్యంలో జరిగిన ఈ ఘటన బెంగాల్‌లో కలకలం రేపింది.

మరోవైపు ఈ ఘటనపై దర్యాప్తు చేస్తున్న పశ్చిమబెంగాల్ సీఐడీ బృందం బుధవారం నీలోయ్ సింగ్ అనే వ్యక్తిని అరెస్ట్ చేసింది. దేబేంద్రనాథ్ రాసిన ఆత్మహత్య లేఖలో నీలోయ్ సింగ్ పేరు ఉంది. ఈ నేపథ్యంలో సీఐడీ పోలీసులు అతడ్ని అరెస్ట్ చేశారు. బీజేపీ ఎమ్మెల్యే దేబేంద్రనాథ్ రే ఆత్మహత్య చేసుకోడానికి దారితీసిన కారణాలపై అతడ్ని ప్రశ్నిస్తున్నారు.logo