శుక్రవారం 03 ఏప్రిల్ 2020
National - Mar 14, 2020 , 17:50:14

కరోనా నివారణకు ధన్వంతరి మహాయాగం

కరోనా నివారణకు ధన్వంతరి మహాయాగం

హైదరాబాద్‌: కరోనా వైరస్‌ వ్యాప్తిని అరికట్టేందుకు ముందస్తు చర్యల్లో భాగంగా తిరుమల తిరుపతి దేవస్థానం(టీటీడీ) కీలక నిర్ణయం తీసుకుంది. భక్తులు నేరుగా స్వామివారిని దర్శించుకునేలా టీటీడీ ఏర్పాట్లు చేస్తోంది. క్యూ కాంప్లెక్స్‌లో భక్తులు వేచి చూసే అవకాశం లేకుండా చర్యలు తీసుకుంది. ప్రతి భక్తుడికి టైంస్లాట్‌ టోకెన్లు ఇవ్వాలని టీటీడీ భావిస్తోంది. 

వసంతోత్సవం, ఆర్జిత బ్రహ్మోత్సవం, సహస్రకళషాభిషేకం, ఇతర విశేష పూజలు,  ప్రత్యేక పూజలను తాత్కాలికంగా రద్దు చేశారు. గంటకు 4వేల మంది భక్తులకు మాత్రమే దర్శనం ఏర్పాట్లు చేస్తున్నారు. ఎప్పటికప్పుడు టీటీడీ పరిస్థితిని సమీక్షిస్తోంది. టాస్క్‌ఫోర్స్‌, కంట్రోల్‌ రూమ్‌లు ఏర్పాటు చేయాలని టీటీడీ నిర్ణయించింది. కరోనా నివారణకు మార్చి 19 నుంచి 21 వరకు ధన్వంతరి మహాయాగం నిర్వహించాలని టీటీడీ భావిస్తోంది. 


logo