సోమవారం 10 ఆగస్టు 2020
National - Jul 31, 2020 , 17:42:18

పోలీసుల‌కు కరోనా.. పోలీస్‌స్టేష‌న్ మూసివేత‌

పోలీసుల‌కు కరోనా.. పోలీస్‌స్టేష‌న్ మూసివేత‌

చెన్నై: త‌మిళ‌నాడులో క‌రోనా మ‌హ‌మ్మారి ఉధృతి కొన‌సాగుతున్న‌ది. ప్ర‌తిరోజు పెద్ద‌సంఖ్య‌లో కొత్త కేసులు న‌మోద‌వుతున్నాయి. త‌మిళ‌నాడు పోలీస్ డిపార్టుమెంట్‌లో కూడా క‌రోనా వైర‌స్ క్ర‌మంగా విస్త‌రిస్తున్న‌ది. తాజాగా తిరుచులి పోలీస్‌స్టేష‌న్‌లో కూడా ఐదుగురు పోలీసుల‌కు క‌రోనా పాజిటివ్‌గా తేలింది. దీంతో ఆ పోలీస్‌స్టేష‌న్‌ను పూర్తిగా మూసివేశారు. క‌రోనా బారినప‌డ్డ పోలీసులను ఆస్ప‌త్రికి త‌ర‌లించి క‌రోనా చికిత్స అందిస్తున్నారు. వారితో క‌లిసి ప‌నిచేసిన మిగ‌తా పోలీసులను హోమ్ క్వారెంటైన్‌లో ఉంచారు. త‌మిళ‌నాడు పోలీస్‌శాఖ ఈ విష‌యాన్ని వెల్ల‌డించింది.  

లోక‌ల్ టు గ్లోబ‌ల్‌.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. న‌మ‌స్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


logo