శుక్రవారం 14 ఆగస్టు 2020
National - Jul 21, 2020 , 23:41:32

ఇలా చేస్తే ఎక్కిళ్ళు తగ్గుతాయి..

ఇలా చేస్తే ఎక్కిళ్ళు తగ్గుతాయి..

హైదరాబాద్: వేగంగా ఆహారం లేదా నీరు తీసుకొనేటప్పుడు తడబడిన సందర్భాల్లో ఎక్కిళ్ళు రావటం సహజమే. ఎక్కిళ్ళు ప్రతీ ఒక్కరికి ఎదో ఒక సమయంలో అనుకోకుండా వస్తూనే ఉంటాయి. ఒక్కోసారి మనం ఏదన్నా తింటున్న సమయంలో ఎక్కిళ్ళు వస్తే ఇబ్బంది అంతా ఇంతా కాదు. నిజానికి ఇదేమీ భయపెట్టే సమస్య కాకపోయినా కాసేపు ఇబ్బంది పెడుతుంది. కొందరిలో 10 నిమిషాల్లోనే తగ్గే ఎక్కిళ్ళు మరికొందరిని మాత్రం గంటల తరబడి వేధిస్తూనే ఉంటాయి. ఇవి వస్తున్నంత సేపు సరిగా మాట్లాడలేకపోవడం, పనిపై మనసు లగ్నం చేయలేకపోవడం వంటివి జరగుతుంటాయి. కాబట్టి, వీటిని తగ్గించుకోవడానికి కొందరు నీళ్ళు త్రాగుతుంటారు. దీని వల్ల శ్వాసక్రియ రేటులో తిరిగి మార్పు రావడం వల్ల ఎక్కిళ్ళు ఆగిపోయితాయి.  

ఎక్కిళ్ళు షాకింగ్ న్యూస్ లు వింటే ఆగిపోతాయి కారణం ఒక్కటే మెదడు కి ఆ న్యూస్ వెళ్లి ఆ ప్రక్రియని కంట్రోల్ చేస్తుంది. అయితే ఇంట్కొక చిట్కా కూడా ఎక్కిళ్ళని తగ్గించడంలో సహాయపడుతుంది.

శొంఠిని పొడి చేసి బెల్లంతో కలిపి పీలిస్తే ఎక్కిళ్ళు ఆగిపోతాయి.అంతేకాదు సొంటి తో తేనెని కలిపి తింటే ఎక్కిళ్ళు తగ్గుతాయి.

ఎక్కిళ్ళు సామన్యంగా పెద్దవారికంటే చిన్న పిల్లలకే ఎక్కువగా వస్తాయి. ఇలా పిల్లలకి ఎక్కిళ్ళు వచ్చినప్పుడు వారిని బోర్లా పడుకోబెట్టి వీపుమీద మెల్లగా తట్టినప్పుడు తగ్గిపోతాయి.

ఒక చిన్న అల్లం ముక్కను నోట్లో వేసుకొని నెమ్మదిగా నములుతూ దాని రసాన్ని మింగుతూ ఉంటే ఎక్కిళ్ళు తగ్గిపోతాయి.

ఎక్కిళ్లు తగ్గడానికి ఒకటిన్నర కప్పు నీటిలో ఒక చెంచా యాలకుల పొడి వేసి మరిగించాలి. ఈ మిశ్రమాన్ని చల్లారనిచ్చి వడకట్టి తాగాలి. ఇలా తాగడం వల్ల ఎక్కిళ్ళు తొందరగా తగ్గుతాయి.logo