సోమవారం 10 ఆగస్టు 2020
National - Jul 31, 2020 , 13:22:45

200 ఫీట్ల లోతులో టైమ్ క్యాప్సూల్‌..

200 ఫీట్ల లోతులో టైమ్ క్యాప్సూల్‌..

హైద‌రాబాద్‌: అయోధ్య‌లో రామాల‌య గ‌ర్భ‌గృహం కింద సుమారు 200 ఫీట్ల లోతులో టైమ్ క్యాప్సూల్‌ను ఏర్పాటు చేయ‌నున్నారు.  తామ్ర‌ప‌త్రాల‌తో టైమ్ క్యాప్సూల్‌ను రూపొందిస్తారు. ఆల‌య చ‌రిత్ర‌, శంకుస్థాన జ‌రిగిన రోజు, భూమిపూజ నిర్వ‌హించిన ముఖ్య అతిథి పేర్ల‌ను ఆ ప‌త్రాల్లో రాసి ఉంచుతారు. భ‌విష్య‌త్తులో ఎటువంటి వివాదాలు త‌లెత్త‌కుండా ఉండేందుకు టైమ్ క్యాప్సూల్‌ను పెడుతుంటారు. వాస్త‌వానికి అయోధ్య‌లో టైమ్ క్యాప్సూల్ పెట్ట‌డ‌డం లేద‌ని తొలుత వార్త‌లు వ‌చ్చాయి. కానీ శ్రీరామ జ‌న్మ‌భూమి తీర్థ క్షేత్ర ట్ర‌స్టు స‌భ్యుడు కామేశ్వ‌ర్ చౌపాల్ దీనిపై క్లారిటీ ఇచ్చారు. 

ఆల‌య చ‌రిత్ర‌, స్థ‌ల పురాణం లాంటి అంశాల‌ను టైమ్ క్యాప్సూల్‌లో రాసి పెడుతామ‌న్నారు.  రాముడు జ‌న్మ‌స్థ‌లంపై మ‌ళ్లీ భ‌విష్యత్తులో వివాదం త‌లెత్త‌కుండా ఉంటుంద‌ని కామేశ్వ‌ర్ చౌపాల్ తెలిపారు.  కామేశ్వ‌ర్ చౌపాల్‌ది బీహార్‌. 1989, న‌వంబ‌ర్ 9 అయోధ్య‌లో రామాల‌య నిర్మాణం కోసం శంకుస్థాప‌న చేసింది ఈయ‌నే. ప్ర‌స్తుతం ఈయ‌న రామ‌జ‌న్మ‌భూమి ట్ర‌స్టులో స‌భ్యుడిగా ఉన్నారు. గ‌తంలో మాజీ ప్ర‌ధాని ఇందిరా గాంధీ.. ఎర్ర‌కోట‌లో టైమ్ క్యాప్సూల్‌ను పాతారు.  న‌రేంద్ర మోదీ కూడా 2011లో మ‌హాత్మా ఆల‌యంలో టైమ్ క్యాప్సూల్‌ను ఏర్పాటు చేశారు. logo