గురువారం 13 ఆగస్టు 2020
National - Jul 27, 2020 , 20:43:18

అయోధ్య‌లో రామాల‌యం కింద టైమ్ క్యాప్సూల్‌

అయోధ్య‌లో రామాల‌యం కింద టైమ్ క్యాప్సూల్‌

అయోధ్య‌: ఉత్త‌ర‌ప్ర‌దేశ్‌లోని అయోధ్య‌లో నిర్మించ‌నున్న శ్రీరామ ఆల‌యం కింద టైమ్ క్యాప్సూల్‌ను ఉంచ‌నున్నారు. సుమారు  2 వేల అడుగుల లోతులో నిక్షిప్తం చేయ‌నున్న ఇందులో రామ‌జ‌న్మ‌భూమి చ‌రిత్ర , సంబంధిత వివ‌రాలు ఉంటాయ‌ని ఆల‌య నిర్మాణానికి సార‌థ్యం వ‌హిస్తున్న శ్రీరామ జ‌న్మ‌భూమి తీర్థ క్షేత్ర ట్ర‌స్టు స‌భ్యుడు కామేశ్వ‌ర్ చౌపాల్ తెలిపారు. ఈ టైమ్ క్యాప్సూల్‌ను ఒక రాగిరేకులోప‌ల భ‌ద్ర‌ప‌రిచి 2 వేల అడుగుల లోతులో ఉంచుతామ‌ని ఆయ‌న చెప్పారు. త‌ద్వారా భ‌విష్య‌త్తులో ఈ స్థ‌లం, దీనిపై నెల‌కొన్న వివాదం గురించి తెలుసుకోవాల‌నుకునే వారికి ఇది ఎంతో ఉప‌యోగ ప‌డుతుంద‌న్నారు. అయోధ్య‌లో రామాల‌యం నిర్మాణానికి ప్ర‌ధాని న‌రేంద్ర మోదీ ఆగ‌స్టు 5న శంకుస్థాప‌న చేయ‌నున్న సంగ‌తి తెలిసిందే.logo