మంగళవారం 19 జనవరి 2021
National - Jan 11, 2021 , 16:02:54

10 రాష్ట్రాల్లో ఏవియ‌న్ ఫ్లూ: ‌కేంద్రం

10 రాష్ట్రాల్లో ఏవియ‌న్ ఫ్లూ: ‌కేంద్రం

న్యూఢిల్లీ: దేశంలో ఇప్ప‌టివ‌ర‌కు 10 రాష్ట్రాల్లో ఏవియ‌న్ ఇన్‌ఫ్లూయెంజా వైర‌స్ బ‌య‌ట‌ప‌డింద‌ని కేంద్రం వెల్ల‌డించింది. జ‌న‌వ‌రి 10 నాటికి ఏడు రాష్ట్రాల్లో అంటే కేర‌ళ‌, రాజ‌స్థాన్‌, మ‌ధ్య‌ప్ర‌దేశ్‌, హిమాచ‌ల్‌ప్ర‌దేశ్‌, హ‌ర్యానా, గుజ‌రాత్‌, ఉత్త‌ర‌ప్ర‌దేశ్ రాష్ట్రాల్లో ఏవియ‌న్ ఫ్లూ బ‌య‌ట‌ప‌డ‌గా, జ‌న‌వ‌రి 11న ఢిల్లీ, ఉత్త‌రాఖండ్‌, మ‌హారాష్ట్ర‌ల్లో ఏవియ‌న్ ఫ్లూ నిర్ధార‌ణ అయ్యింద‌ని కేంద్రం వెల్ల‌డించింది. 

రాజ‌స్థాన్‌లోని భిల్వారా, క‌రౌలీ, టోంక్ జిల్లాల్లో.. గుజ‌రాత్‌లోని సూర‌త్‌, వ‌డోద‌ర‌, వ‌ల్సాద్ జిల్లాల్లో పెద్ద సంఖ్య‌లో కాకులు, వ‌ల‌స‌ప‌క్షులు, అట‌వీ ప‌క్షులు మృతిచెందాయ‌ని కేంద్ర ఫిష‌రీస్‌, ప‌శుసంవ‌ర్ధ‌క‌, డెయిరీ మంత్రిత్వ శాఖ తెలిపింది. ఉత్త‌రాఖండ్‌లోని కోట్‌ద్వార్, డెహ్రాడూన్‌లో ఏవియ‌న్ ఫ్లూతో భారీగా కాకులు మ‌ర‌ణించాయ‌ని వెల్ల‌డించింది. ఢిల్లీలోని న్యూఢిల్లీ, సంజ‌య్ లేక్ ఏరియాలో కాకులు, బాతులు మృతిచెందాయ‌ని పేర్కొన్న‌ది. 

ఇక, మ‌హారాష్ట్ర‌లోని ప‌ర్భ‌ని జిల్లాలో.. కోళ్లలో ఏవియ‌న్ ఇన్‌ఫ్లూయెంజా వైర‌స్ ల‌క్ష‌ణాలు బ‌య‌ట‌ప‌డ్డాయ‌ని కేంద్ర ఫిష‌రీస్‌, ప‌శుసంవ‌ర్ధ‌క‌, డెయిరీ మంత్రిత్వ శాఖ తెలిపింది. ఇప్ప‌టికే మ‌హారాష్ట్ర రాజ‌ధాని ముంబైతోపాటు థానే, డ‌పోలీ, బీడ్ జిల్లాల్లోని కాకుల్లో ఏవియ‌న్ ఇన్‌ఫ్లూయెంజా ల‌క్ష‌ణాలు బ‌య‌ట‌ప‌డ్డాయి.        

లోకల్ టు గ్లోబల్.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్లో. నమస్తే తెలంగాణఆండ్రాయిడ్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.