సోమవారం 06 జూలై 2020
National - Jun 03, 2020 , 12:14:17

బాలీవుడ్‌ పాటకు తోబుట్టువుల టిక్‌టాక్‌ : వీడియో వైరల్‌

బాలీవుడ్‌ పాటకు తోబుట్టువుల టిక్‌టాక్‌ : వీడియో వైరల్‌

సోషల్‌మీడియా పుణ్యమా అని ఇప్పుడు ఇంట్లో కూర్చొనే వారి ప్రతిభను ప్రపంచానికి తెలియజేస్తున్నారు. చైనా యాప్‌ అయిన టిక్‌టాక్‌తో డ్యాన్సర్లు, యాక్టర్లందరూ బయట పడుతున్నారు.

జార్ఖండ్‌కు చెందిన ఇద్దరు తోబుట్టువులు బాలీవుడ్‌ పాటకు నృత్యం చేసిన వీడియో సోషల్‌మీడియాలో హల్‌చల్‌ చేస్తున్నది. వీరి కట్టుబొట్టూ చూస్తుంటే టెక్నాలజీ గురించి పెద్దగా తెలిసినట్టు కనిపించకపోయినా టిక్‌టాక్‌లో మాత్రం ఇరగదీసేస్తున్నారు.  ఒక ట్విటర్‌ యూజర్‌ వీరి టిక్‌టాక్‌ వీడియోను షేర్‌ చేశారు. దీనికి ‘లెట్స్‌ స్మైల్‌’(నవ్వుదాం) అనే క్యాప్షన్‌ను జోడించారు. దీనికి ఇండియన్‌ టెలివిజన్‌ హోస్ట్‌ ‘ఈరోజు ఉదయాన్నే ఏదైతే నేను చూడాలనుకున్నానో అదే చూశాను. 2020 కరోనా కాలంలో సానుకూలంగా జీవిస్తున్న ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు’ అంటూ రీట్వీట్‌ చేసింది. ఈ తోబుట్టువులకి టిక్‌టాక్‌లో 1.3 మిలియన్లు ఫాలోవర్స్‌ ఉన్నారు. టిక్‌టాక్‌ ద్వారా ఇప్పుడు ట్విటర్‌లో కూడా ఫేమస్ అవుతున్నారు వీరిరువురు. ఇప్పటికీ ఈ వీడియోను 53K మంది వీక్షించగా 1.3K మంది లైక్‌ చేశారు. logo