మంగళవారం 26 మే 2020
National - May 23, 2020 , 20:20:47

టిక్‌టాక్‌ చేసింది... జైలుకు పోయింది...

టిక్‌టాక్‌ చేసింది... జైలుకు పోయింది...

టిక్‌టాక్‌తో చాలా మంది తమలోని నటన, నైపుణ్యాలను ప్రపంచానికి చాటుతూ అనతి కాలంలోనే పాపులర్‌ అవుతున్నారు. తమ ప్రతిభతో వేలాది మంది అభిమానులను సొంతం చేసుకునేందుకు టిక్‌టాక్‌ మంచి వేధికగా ఉపయోగపడుతుంది. ఇదే క్రమంలో చాలా మంది తమ అభిమానుల సంఖ్యను పెంచుకునేందుకు అనవసర పనులు చేస్తూ తప్పులు కూడా చేస్తూ ఇబ్బందులకు గురవుతున్నారు. దీంతో చాలా మంది మంచికి కాకుండా చెడు పనులకు కూడా టిక్‌టాక్‌ను ఉపయోగిస్తుండడం, కొందరు మానసిక సమస్యలకు గురవుతుండడంతో దేశంలో టిక్‌టాక్‌ను బ్యాన్‌ చేయాలని పెద్ద ఎత్తున డిమాండ్‌ వస్తుంది. 

అయితే ఈ మద్యనే అహ్మదాబాద్‌లో ఒక అమ్మాయి తన టిక్‌టాక్‌ అభిమానులను సంతోషపరిచేందుకు రోడ్డుపై ఓ వీడియో చేసింది. వినూత్నంగా వీడియో చేయాలనే ఉద్దేశంతో ఆ అమ్మాయి రాత్రి 9 గంటలకు లాక్‌డౌన్‌ నిభందనలను ఉల్లంఘిస్తూ నడి రోడ్డుపై దొర్లుతూ టిక్‌టాక్‌ వీడియోలు చేసింది. అంతటితో ఆగకుండా లాక్‌డౌన్‌ ఎత్తేయాలంటూ మోడీని అడుగుతున్నట్లు వ్యంగ్యంగా వీడియో తీసింది. దీంతో పోలీసుల దృష్టికి ఈ వీడియో వెళ్ళడంతో అమ్మాయిపై కేసు నమోదు చేసి అరెస్టు చేశారు పోలీసులు.


logo