ఆదివారం 12 జూలై 2020
National - Jul 01, 2020 , 02:44:29

యూజర్ల భద్రతే ముఖ్యం!

యూజర్ల భద్రతే ముఖ్యం!

  • అనుమానాలన్నింటినీ నివృత్తి చేస్తాం.. నిషేధంపై స్పందించిన టిక్‌టాక్‌

న్యూఢిల్లీ: వినియోగదారుల సమాచార భద్రత, గోప్యత విషయంలో భారతీయ చట్టాలకు లోబడి ఉన్నట్టు టిక్‌టాక్‌ ఇండియా సంస్థ పేర్కొంది. అయితే, ప్రభుత్వ నిషేధ నిర్ణయాన్ని శిరసావహిస్తామన్నది. టిక్‌టాక్‌ ఇండియా చీఫ్‌ నిఖిల్‌ గాంధీ మంగళవారం మాట్లాడుతూ.. ‘టిక్‌టాక్‌తో పాటు మరో 59 చైనా యాప్స్‌ను నిషేధించాలని భారత ప్రభుత్వం మధ్యంతర ఆదేశాలను జారీ చేసింది. వాటిని పాటించే ప్రక్రియలో ఉన్నాం. మా యాప్‌పై నెలకొన్న అనుమానాలను నివృత్తి చేసేందుకు కేంద్ర ప్రభుత్వం నుంచి ఆహ్వానం అందింది. 

యాప్‌నకు సంబంధించిన అన్ని వివరాలను సంబంధిత అధికారులకు తెలియజేస్తాం’ అని అన్నారు. ‘భారతీయ వినియోగదారులకు సంబంధించిన సమాచారాన్ని చైనాతో సహా మరే ఇతర విదేశీ ప్రభుత్వాలతో పంచుకోలేదు. వినియోగదారుల సమాచార భద్రత, గోప్యత, సమగ్రతకు అధిక ప్రాధాన్యం ఇస్తున్నాం’ అని తెలిపారు. భారతీయుల సమాచారాన్ని భవిష్యత్తులో ఎవరైనా కోరినా.. అందజేసే ప్రసక్తే లేదని గాంధీ వివరించారు. logo