మంగళవారం 07 జూలై 2020
National - Jul 01, 2020 , 02:44:40

టిక్‌టాక్‌కు ప్రకటనల ఝలక్‌

టిక్‌టాక్‌కు ప్రకటనల ఝలక్‌

న్యూఢిల్లీ: టిక్‌టాక్‌కు ఆర్థికంగా భారీ దెబ్బ పడింది. ఆ సంస్థకు కోట్ల రూపాయల విలువైన ప్రకటన లు నిలిచిపోయాయి. పలు అడ్వైర్టెజింగ్‌, మార్కెటింగ్‌ ఏజె న్సీలు తమ బ్రాండ్‌ల గురించి ప్రచారాన్ని తాత్కాలికంగా నిలిపేశాయి. ప్రముఖ వ్యాపార సంస్థలు పెప్సీ, పుమా, క్లీన్‌ అండ్‌ క్లియర్‌, ఫ్లిప్‌కార్ట్‌, మింత్రా తదితర కంపెనీలు తమ ప్రచారాన్ని ఈ యాప్‌ ద్వారా కొనసాగిస్తున్నాయి. టిక్‌టాక్‌లో ఎక్కువ ప్రకటనల ఒప్పందాలు హోంస్క్రీన్‌, హాష్‌ట్యాగ్‌ ప్రమోషన్‌ కలిపి ఉన్నవే. యూట్యూబ్‌, ఇన్‌స్టాగ్రామ్‌ వంటి యాప్‌లలోని ప్రకటనల రేట్లకంటే కూడా టిక్‌టాక్‌ వేదికపైనే రేట్లు ఎక్కువగా ఉన్నాయి. టిక్‌టాక్‌లో ప్రకటనల రేంజ్‌లు రూ.5 లక్షల నుంచి 50 లక్షల వరకు ఉన్నాయి. ప్రపంచవ్యాప్తంగా 200 కోట్ల మంది టిక్‌టాక్‌ యాప్‌ను డౌన్‌లోడ్‌ చేసుకోగా, అందులో మూడోవంతు భారత్‌లోనే చేసుకున్నట్టు ‘సెన్సార్‌ టవర్‌' నివేదిక పేర్కొంది. 


logo