గురువారం 09 జూలై 2020
National - Jun 22, 2020 , 19:56:11

72గంటలు.. 5లక్షల డౌన్‌లోడ్లు

72గంటలు.. 5లక్షల డౌన్‌లోడ్లు

న్యూఢిల్లీ : బాయ్‌కాట్‌ చైనాతో నినాదంతో ఓ దేశీయ షార్ట్‌ వీడియా షేరింగ్‌ యాప్‌ను 72గంటల్లో 5లక్షల యూజర్లు డౌన్‌లోడ్‌ చేసుకున్నారు. తూర్పు లడఖ్‌లోని గాల్వాన్‌లో లోయలో జూన్‌ 15న చైనా దళాలతో జరిగిన ముఖాముఖిలో ఓ కల్నల్‌తో సహా 20 మంది భారత సైనికులు అమరులైన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో చైనీస్ ఉత్పత్తులు, యాప్‌లు బాయ్‌కాట్‌ చేయాలని నినాదం దేశంలో పెరుగుతున్నది.

ఈ క్రమంలో చైనీస్ షార్ట్ ఎంటర్‌టైన్‌మెంట్‌ వీడియో షేరింగ్ ప్లాట్ ఫాం టిక్‌టాక్‌కు ప్రత్యామ్నాయంగా రూపొందించిన భారతీయ సోషల్ యాప్ చింగరిని కేవలం 72 గంటల్లో ఐదు లక్షల మంది డౌన్‌లోడ్లు నమోదు చేసినట్లు డెవలపర్లు బిశ్వత్మా నాయక్, సిద్ధార్థ గౌతమ్ ఒక ప్రకటనలో తెలిపారు. గూగుల్ ప్లే స్టోర్‌లో చింగరి కోసం డిమాండ్ నంబర్‌ వన్‌ స్థానంలో ట్రెండ్‌ అయిందని, ఇప్పటికే టిక్‌టాక్‌ క్లోన్‌ ప్లాట్‌ఫారమ్‌ అయిన మిరాన్‌ యాప్‌ను అధిగమించిందని పేర్కొన్నారు.  యాప్‌ అనేక భారతీయ భాషల్లో లభ్యం అవుతాయని, యూజర్ వీడియోలను డౌన్ లోడ్, అప్‌లోడ్‌ చేయవచ్చని, స్నేహితులతో చాటింగ్‌, కొత్త వ్యక్తులతో ఇంటరాక్ట్ కావడానికి, కంటెంట్‌ను పంచుకోవడానికి, ఫీడ్‌బ్యాక్‌ బ్రౌజ్ చేయవచ్చని చెప్పారు. వాట్సప్ స్టేటస్, వీడియోలు, ఆడియో క్లిప్పింగ్స్‌, స్టిక్కర్లు, ఫొటోలు సృజనాత్మకంగా పొందడానికి అవకాశం ఉందని చెప్పారు.


logo