శుక్రవారం 05 జూన్ 2020
National - May 12, 2020 , 10:19:58

ఢిల్లీలో టిక్‌టాక్ స్టార్ హ‌త్య కేసు నిందితులు అరెస్ట్‌

ఢిల్లీలో టిక్‌టాక్ స్టార్ హ‌త్య కేసు నిందితులు అరెస్ట్‌

న్యూఢిల్లీ: ఢిల్లీలో ఇద్ద‌రు షార్ప్ షూట‌ర్ల‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. టిక్‌టాక్ స్టార్, జిమ్ ట్రెయిన‌ర్ అయిన మోహిత్ మోర్ హ‌త్య కేసులో వీరు నిందితులుగా ఉన్న వారిని ఢిల్లీ స్పెష‌ల్ వింగ్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. గ‌త ఏడాది న‌జ‌ఫ్‌గ‌డ్‌లోని ధ‌రంపుర ప్రాంతంలో ముగ్గురు దుండ‌గులు ముఖాల‌కు మాస్కుల‌తో వ‌చ్చి మోహిత్ మోర్‌ను అతి స‌మీపం నుంచి కాల్చిచంపారు. ఈ కేసులో ఇప్ప‌టికే ఒక నిందితుడిని (మైన‌ర్‌) అదుపులోకి తీసుకున్న పోలీసులు అత‌ను ఇచ్చిన స‌మాచారం ఆధారంగా మిగ‌తా ఇద్ద‌రి కోసం గాలింపులు చేప‌ట్టి ఎట్ట‌కేల‌కు అరెస్ట్ చేశారు. logo