శుక్రవారం 30 అక్టోబర్ 2020
National - Sep 25, 2020 , 09:30:27

తీహార్ జైలు డీజీకి క‌రోనా పాజిటివ్‌

తీహార్ జైలు డీజీకి క‌రోనా పాజిటివ్‌

న్యూఢిల్లీ: దేశ రాజ‌ధానిలో ఢిల్లీలో ఉన్న తీహార్ జైలు డైరెక్ట‌ర్ జెన‌ర‌ల్ సందీప్ గోయ‌ల్ క‌రోనా బారిన‌ప‌డ్డారు. ఆయ‌నకు క‌‌రోనా సోకింద‌ని తీహార్ జైలు అధికారులు శుక్ర‌వారం ఉద‌యం ప్ర‌క‌టించారు. ప్ర‌స్తుతం ఆయ‌న స్వీయ నిర్బంధంలో ఉన్నారు. ఈమ‌ధ్య కాలంలో త‌న‌ను క‌లిసిన‌వారు క‌రోనా ప‌రీక్ష‌లు చేయించుకోవాల‌ని సూచించారు. దేశంలోనే అత్యంత ప్రాముఖ్య‌త క‌లిగిన తీహార్ జైలులో మొద‌టి క‌రోనా కేసు మే నెల‌లో వెలుగుచూసింది.