శనివారం 04 జూలై 2020
National - Jun 23, 2020 , 07:02:25

ఐదుగురిని బలిగొన్న పులి మృతి

ఐదుగురిని బలిగొన్న పులి మృతి

నాగ్‌పూర్‌ ‌: ఐదుగురు వ్యక్తులను పొట్టన బెట్టుకున్న పులి సోమవారం నాగ్‌పూర్‌ జిల్లాలోని రక్షిత కేంద్రంలో మరణించిందని అటవీశాఖ అధికారులు తెలిపారు. ‘కేటీ-1’ అని పేరు పెట్టిన ఈ పులి గత ఐదు నెలల్లో కొలరా, బమన్‌గావ్‌, సతారా గ్రామాల్లో వేర్వేరు సమయాల్లో ఐదుగురిని చంపింది. ఈ నెల 6న చివరి ఘటన జరిగింది. దీంతో మహారాష్ట్ర వన్యప్రాణుల చీఫ్‌ వార్డెన్‌ అనుమతి మేరకు ఈ నెల 10న మత్తు పదార్థాలు గల బుల్లెట్‌తో ఆ పులిని బంధించి ఈ నెల 11న నాగ్‌పూర్‌లోని గోరెవాడ రక్షిత కేంద్రానికి తరలించారు.logo