గురువారం 28 జనవరి 2021
National - Jan 08, 2021 , 08:10:15

వ్యక్తిని చంపి.. ఎత్తుకెళ్లిన పెద్దపులి

వ్యక్తిని చంపి.. ఎత్తుకెళ్లిన పెద్దపులి

జైపూర్‌: పులులు గ్రామాలపై పడి జనాలను పొట్టన పెట్టుకుంటున్న ఘటనలు తరచూ చూస్తూనే ఉన్నాం. తాజాగా రాజస్థాన్‌లోని ఓ గ్రామంలోకి చొరబడిన పెద్దపులి ఓ వ్యక్తిపై దాడిచేసి చంపేసింది. రాష్ట్రంలోని సవాయి మాధోపూర్‌ జిల్లా కనేడీలో ఈ ఘటన జరిగింది. రణతంబోర్‌ టైగర్‌ రిజర్వ్‌ (ఆర్‌టీఆర్‌)కు సమీపంలో ఉన్న కనేడీ గ్రామంపై నిన్న పెద్దపులి దాడి చేసింది. గ్రామంలో కనిపించిన ఓ వ్యక్తిని చంపేసి ఎత్తుకెళ్లిందని అధికారులు తెలిపారు. మృతుడిని పప్పు గుజ్జర్‌ (40)గా గుర్తించామ న్నారు. అయితే ఆయన మృతదేహం కనిపించడం లేదని, తమ సిబ్బంది వెతుకుతున్నారని టైగర్‌ రిజర్వ్‌ ఫీల్డ్‌ డైరెక్టర్‌ టికమ్‌ చంద్‌ వర్మా వెల్లడించారు. కాగా, పులి సంచరిస్తుండటంతో టైగర్‌ రిజర్వ్‌ సమీపంలోని గ్రామాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. మృతుని కుటుంబానికి రూ.4 లక్షలు పరిహారం అందిస్తామన్నారు.


logo