ఆదివారం 09 ఆగస్టు 2020
National - Jul 21, 2020 , 21:33:31

కొండ చిలువ‌కు భ‌య‌ప‌డి దారిచ్చిన పులి.. ఇదెక్క‌డి విచిత్రం!

కొండ చిలువ‌కు భ‌య‌ప‌డి దారిచ్చిన పులి.. ఇదెక్క‌డి విచిత్రం!

ఎంత పెద్ద జంతువు‌నైనా అమాంతం చీల్చి చెండాడ‌డం పులి నైజం. అలాంటిది ఒక కొండ చిలువ‌కు భ‌య‌ప‌డి పులి ప‌క్క‌కి జ‌రిగి దారిచ్చింది. 44 సెకండ్ల‌పాటు న‌డిచే ఈ వీడియోను ఇండియ‌న్ ఫారెస్ట్ స‌ర్వీస్ అధికారి ట్విట‌ర్‌లో పోస్ట్ చేశారు. అదేంటి కొండ చిలువ‌కు లొంగి పులి దారి ఇవ్వ‌డం ఏంట‌ని నెటిజ‌న్లు ఆరా తీస్తున్నారు. 'కొండ చిలువ‌కు దారి వ‌దిలిన పులి' అనే శీర్షిక‌ను జోడించారు.

వీడియోలో చూసిన‌ట్ల‌యితే కొండ ‌చిలువ‌, పులి రెండూ ఎదురుప‌డ్డాయి. పులి దారికి కొండ‌చిలువ అడ్డంగా ప‌డుకొని ఉంది. పులికి భ‌య‌పడి పాము ప‌క్క‌కి జ‌ర‌గాల్సింది పోయి, పులే వెన‌క్కి త‌గ్గింది. ఆ స‌మ‌యంలో పులి నీర‌సంగా ఉందో ఏమో, కాసేపు అలానే ఎదురుచూసింది ప‌క్క‌కు జ‌రుగుతుందేమో అని. ఎంత‌సేప‌టికి జ‌ర‌గ‌క‌పోయే స‌రికి పులే వెనక్కి త‌గ్గింది. ఈ వీడియో చూసి నెటిజ‌న్లు ప‌లు ర‌కాలుగా కామెంట్లు పెడుతున్నారు. logo