సోమవారం 06 జూలై 2020
National - Jun 16, 2020 , 15:10:07

పులి పిల్లలను చంపిన మగపులి

పులి పిల్లలను చంపిన మగపులి

అమరియా : మధ్యప్రదేశ్‌రాష్ట్రంలోని బందావ్‌గర్‌ పులుల రిజర్వ్‌ ఫారెస్టులో మంగళవారం రెండు పులి పిల్లలను ఓ మగ పులి పొట్టనబెట్టుకుంది. పులి పిల్లలు చనిపోయి ఉండడంతో పిల్లి జాతికి చెందిన ఓ మగ జంతువు చంపి ఉంటుందని అటవీశాఖ అధికారులు మొదట భావించారు. విచారణలో భాగంగా శవపరీక్ష నివేదిక పరిశీలించి మగపులి దాడి చేసి  చంపిందని నిర్ధారించుకున్నామని బందావ్‌గర్‌ పులుల రిజర్వ్‌‌ ఫారెస్టు అసిస్టెంట్‌ డైరెక్టర్‌ అనిల్‌శుక్లా తెలిపారు. ఇదే విషయాన్ని జాతీయ పులుల సంరక్షణ సంస్థకు నివేదించినట్లు ఆయన పేర్కొన్నారు. logo