మంగళవారం 04 ఆగస్టు 2020
National - Jul 14, 2020 , 17:59:37

ఫ్లైఓవ‌ర్‌పై విశ్రాంతి తీసుకుంటున్న పులి : వీడియో వైర‌ల్‌

ఫ్లైఓవ‌ర్‌పై విశ్రాంతి తీసుకుంటున్న పులి :  వీడియో వైర‌ల్‌

మధ్యప్రదేశ్‌లోని ఫ్లైఓవర్ మధ్యలో విశ్రాంతి తీసుకుంటున్న పులి నెట్టింట్లో వైర‌ల్‌గా మారింది. పార్క్‌లో ఉండి ఉండి బోర్ కొట్టిన‌ట్టుంది ఇలా రోడ్డు మీద‌కి వ‌చ్చి సంద‌ర్శ‌కుల‌కు ఆక‌ర్ష‌ణ‌గా నిలిచింది. సియోని జిల్లాకు 25 కిలోమీటర్ల దూరంలో ఉన్న పెంచ్ నేషనల్ పార్క్ బఫర్ జోన్ పరిధిలోకి వచ్చే నేషనల్ హైవే 7 లో ఈ సంఘటన జరిగింది. పులిని చూసేందుకు ప్ర‌యాణికులంద‌రూ రోడ్డు మీద ఆగిపోవ‌డంతో ట్రాఫిక్ జామ్ కూడా నెల‌కొన్న‌ది.

పులికి ద‌గ్గ‌ర్లో ఉన్న ప్ర‌జ‌ల మీద‌కి ఎక్క‌డ దాడికి దిగుతుందో అని భ‌య‌ప‌డ్డారు. రోడ్డు మీద ప‌డుకొని పెద్ద‌గా గాండ్రిస్తున్న‌ప్ప‌టికీ ఎవ‌రికి ఎలాంటి హాని చేయ‌లేదు. పులిని చూసిన కొంద‌రు పోలీసులకు స‌మాచారం అందించారు. ఈలోపే కాసేపు విశ్రాంతి తీసుకున్న పెద్ద పులి స్వ‌యంగా అడ‌వి వైపుకు అడుగులు వేసింది. ఈ ప్రాంతం పెంచ్ నేషనల్ పార్కుకు దగ్గరగా ఉంది. ఇది పెద్ద సంఖ్యలో పులులకు నివాసంగా ఉంది. 


logo