శనివారం 15 ఆగస్టు 2020
Ashoka Developers
National - Jul 25, 2020 , 16:55:57

ఉత్తరాఖండ్‌ సీటీఆర్‌లో పులి పిల్ల మృతి

ఉత్తరాఖండ్‌ సీటీఆర్‌లో పులి పిల్ల మృతి

రామ్‌నగర్‌ (ఉత్తరాఖండ్‌) : ఉత్తరాఖండ్‌లోని కార్బెట్ టైగర్ రిజర్వ్ (సీటీఆర్‌)లోని జిర్నా ప్రాంతంలో ఐదు నెలల వయసున్న పులి పిల్ల మృతదేహం శుక్రవారం కనుగొనబడింది. ఈ ఏడాది సీటీఆర్‌లో మరణించిన రెండో పులి ఇది. జిర్నా రేంజ్‌లోని లాల్‌డాంగ్ బీట్‌లో ఈ పులి కలేబరాన్ని అటవీ అధికారులు గుర్తించారని సీటీఆర్‌ డైరెక్టర్‌ రాహుల్ చెప్పారు.

“ఐదు నెలల వయసున్న పులి ప్లిలను జిర్నా పరిధిలో అటవీ సిబ్బంది కనుగొన్నారు. ఆకలి కారణంగా అది మరణించినట్లు పోస్టుమార్టం నివేదిక వెల్లడించింది. ఈ ఏడాది సీటీఆర్‌లో మరణించిన రెండో పులి ఇది’’ అని రాహుల్‌ అన్నారు. ఇదిలా ఉండగా ఈ ఏడాది మే 29న సీటీఆర్‌లోని జిర్నా శ్రేణిలో 10 సంవత్సరాల వయసున్న పులి మృతదేహం దొరికింది. పులి మెడ భాగంలో గాయాలు ఉన్నట్లు అధికారులు గుర్తించారు. రెండు పులులు ఘర్షణ పడిన అనంతరం ఒక పులి మృతి చెందవచ్చని అధికారులు ప్రాథమిక అంచనాకు వచ్చారు. గత రెండేళ్లలో చాలా పులుల మృతదేహాలు దొరికాయని రాహుల్‌ పేర్కొన్నారు. ప్రస్తుతం సీటీఆర్‌లో 260 పులులు ఉన్నాయని రాష్ట్ర అటవీ శాఖ అధికారులు తెలిపారు. logo