ఆదివారం 07 జూన్ 2020
National - Apr 01, 2020 , 23:08:49

క‌రోనాపై పోరుకు టిక్‌టాక్ భారీ సాయం

క‌రోనాపై పోరుకు టిక్‌టాక్ భారీ సాయం

ఢిల్లీ: క‌రోనాపై పోరుకు భార‌త్‌కు అండ‌గా నిలిచింది టిక్‌టాక్‌. క‌రోనా వ్యాప్తిని నియంత్రించేందుకు వీడియో యాప్ టిక్‌టాక్ త‌న‌వంతు సాయం అందించింది. సుమారు రూ. 100 కోట్ల విలువైన నాలుగు ల‌క్ష‌ల‌ హ‌జ్మ‌త్ సూట్ల‌ను క‌రోనా బాధితుల‌కు వైద్యం అందిస్తున్న వైద్య బృందాల‌కు అందించ‌నుంది. ఈ మేర‌కు తొలి విడ‌త‌లో 26వేల‌కు పైగా ఈ రోజు ఉద‌యం భార‌త్‌కు పంపించింది. మ‌రో విడ‌త‌లో ల‌క్ష‌కు పైగా సూట్ల‌ను ఇదే వారంలో పంపించ‌నున్న‌ట్లు ప్ర‌క‌టించింది. మిగ‌తా సూట్ల‌ను రెండు వారాల్లో ద‌శ‌ల వారిగా అందిస్తామ‌ని టిక్‌టాక్ అధికారులు పేర్కొన్నారు. వైద్య బృందానికి సూట్ల కొర‌త వేధిస్తున్న నేప‌థ్యంలో...టిక్‌టాక్ సూట్ల‌ను అందించ‌డం కాస్తా ఉప‌శ‌మ‌నంగా చెప్పుకోవ‌చ్చు.


logo