శుక్రవారం 07 ఆగస్టు 2020
National - Jul 10, 2020 , 14:29:28

చైనాకు వ్యతిరేకంగా టిబెట్ యువత నిరసన

చైనాకు వ్యతిరేకంగా టిబెట్ యువత నిరసన

ధర్మశాల: టిబెట్ యువత చైనాకు వ్యతిరేకంగా గళమెత్తింది. హిమాచల్ ప్రదేశ్‌లోని ధర్మశాలలో శుక్రవారం నిరసన తెలిపింది. టిబెట్ యువ కాంగ్రెస్ ఆధ్వర్యంలో చేపట్టిన ఈ ఆందోళనలో చైనాకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈ సందర్భంగా చైనా వస్తువులను బహిష్కరించాలని డిమాండ్ చేశారు. చైనా వస్తువులను తగులబెట్టారు.

టిబెట్ యువ కాంగ్రెస్ ఆధ్వర్యంలో శుక్రవారం ప్రపంచవ్యాప్తంగా చైనాకు వ్యతిరేకంగా నిరసన ప్రదర్శనలు నిర్వహించినట్లు అధ్యక్షుడు గోన్పొ ధుండప్ తెలిపారు. చైనా చోరబాట్లు, మానవ హక్కుల ఉల్లంఘనలు, కరోనా వ్యాప్తిపై తప్పుడు సమాచారాన్ని ఖండిస్తున్నట్లు ఆయన చెప్పారు. కరోనా మహమ్మారి వల్ల ప్రపంచ వ్యాప్తంగా లక్షలాది మంది మరణించారని, ఎంతో నష్టం జరిగిందన్నారు. ఈ నేపథ్యంలో చైనా వస్తువులను బహిష్కరించాలని పిలుపునిచ్చినట్లు గోన్పొ తెలిపారు.
 logo