ఆదివారం 09 ఆగస్టు 2020
National - Jul 18, 2020 , 09:43:48

నేడు పలు రాష్ట్రాల్లో మోస్తరు వర్షాలు

నేడు పలు రాష్ట్రాల్లో మోస్తరు వర్షాలు

న్యూఢిల్లీ : ఉత్తరాఖండ్‌, ఉత్తర రాజస్థాన్‌, ఈశాన్య రాష్ట్రాలతోపాటు పలు ప్రాంతాల్లో శనివారం ఉరుములు, మెరుపులతో తేలిక నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశముందని భారత వాతావరణశాఖ తెలిపింది. ఉత్తరాఖండ్‌, ఉత్తర రాజస్థాన్‌, దక్షిణ పంజాబ్‌, హర్యానా, పశ్చిమ ఉత్తరప్రదేశ్‌, ఆంధ్రప్రదేశ్‌ దక్షిణ తీర ప్రాంతాలతోపాటు పశ్చిమ బెంగాల్‌లోని హిమాలయ పరివాహాక ప్రాంతాలు, ఈశాన్య రాష్ట్రాలపై స్వల్పం నుంచి తీవ్రమైన ఉష్ణప్రసరణ ఆవహించి ఉందని ఉపగ్రహ ఛాయచిత్రం చూపుతోంది. దీని కారణంగా ఆయా రాష్ట్రాల్లో ఉరుములతో తేలికపాటి జల్లులు కురిసే అవకాశముందని ఐఎండీ పేర్కొంది.  రానున్న రెండుగంటల్లో ముజఫర్‌నగర్‌, హస్తినాపూర్‌, బిజ్నూర్‌, షహరాన్‌పూర్‌, నజిబాబాద్‌, రుర్కీ, నర్వానా, చాంద్‌పూర్‌, హపూర్‌, కైతాల్‌, అమ్రోహ, సంబాల్‌, షామ్లీ, గ్రాముఖుటేశ్వర్ తదితర ప్రాంతాల్లో ఉరుములతో వర్షం కురువనుందని వెల్లడించింది.logo