గురువారం 28 మే 2020
National - May 09, 2020 , 21:46:00

మూడేళ్ల చిన్నారిని చంపిన చిరుతపులి

మూడేళ్ల చిన్నారిని చంపిన చిరుతపులి

బెంగ‌ళూరు: క‌ర్ణాట‌క రాష్ట్రంలోని రామ‌న‌గ‌ర జిల్లా క‌ద‌ర‌య‌ణ‌పాలియా గ్రామంలో దారుణ సంఘ‌ట‌న చోటు చేసుకుంది. ఇంటి బ‌య‌ట త‌ల్లిదండ్రుల‌తో పాటు ప‌డుకున్న మూడేళ్ల బాలుడిని చిరుత‌పులి ఎత్తుకెళ్లింది. ఉద‌యం బాలుడు త‌ప్పిపోయాడ‌ని గుర్తించిన కుటుంబ స‌భ్యులు అత‌ని కోసం వెత‌క‌గా, గ్రామ శివారులో చిన్నారి మృత‌దేహాన్ని క‌నుగొన్నారు. స‌మాచారం అందుకున్న ఫారెస్ట్ అధికారులు, పోలీసులు చిరుత‌పులి కోసం గాలింపు చ‌ర్య‌లు చేప‌ట్టారు. రాష్ట్ర అట‌వీ శాఖ మంత్రి ఆనంద్ సింగ్ బాలుడి కుటుంబాన్ని ప‌రామ‌ర్శించి  రూ.7.5 ల‌క్ష‌ల ఎక్స్‌గ్రేషియా ప్ర‌క‌టించారు. బెంగ‌ళూరు గ్రామీణ బ్యాంక్ ఎండీ డీకే సురేశ్‌, ఎమ్మెల్యే మంజునాథ్ కుటుంబ స‌భ్యుల‌ను క‌లిసి ప‌రామ‌ర్శించారు.


logo