సోమవారం 13 జూలై 2020
National - Jun 16, 2020 , 06:53:41

జమ్మూకశ్మీర్‌లో ముగ్గురు ఉగ్రవాదులు హతం

జమ్మూకశ్మీర్‌లో ముగ్గురు ఉగ్రవాదులు హతం

శ్రీనగర్‌ : షోపియాన్‌ జిల్లాలో ఇవాళ ఉదయం భదత్రా బలగాలు, ఉగ్రవాదులకు మధ్య ఎదురుకాల్పులు సంభవించాయి. ఈ కాల్పుల్లో ముగ్గురు ఉగ్రవాదులు హతమయ్యారు. షోపియాన్‌లోని తుర్కవంగంలో ఉగ్రవాదులు తలదాచుకున్నట్లు భద్రతా బలగాలకు సమాచారం అందింది. దీంతో అక్కడ బలగాలు, పోలీసులు కలిసి ఆపరేషన్‌ నిర్వహించారు. ముగ్గురు ఉగ్రవాదులను మట్టుబెట్టగా.. మరికొంత మంది ఉగ్రవాదులు ఉండొచ్చనే అనుమానంతో బలగాలు అక్కడ కూంబింగ్‌ కొనసాగిస్తున్నాయి.


logo