శుక్రవారం 10 జూలై 2020
National - Jun 03, 2020 , 10:53:03

ఎదురుకాల్పుల్లో ముగ్గురు ఉగ్రవాదులు హతం

ఎదురుకాల్పుల్లో ముగ్గురు ఉగ్రవాదులు హతం

జమ్ముకశ్మీర్‌ : ఎదురు కాల్పుల్లో ముగ్గురు ఉగ్రవాదులు హతమయ్యారు. ఈ ఘటన జమ్ముకశ్మీర్‌ రాష్ట్రం పుల్వామా జిల్లా కంగన్‌ ప్రాంతంలో చోటుచేసుకుంది. విశ్వసనీయ సమాచారం మేరకు ఉగ్రవాదుల ఆచూకీకి ఆర్మీ సిబ్బంది, స్థానిక పోలీసులు కంగన్‌ ప్రాంతంలో గాలింపు చర్యలు చేపట్టారు. ఈ క్రమంలో సైనికులకు, ఉగ్రవాదులకు మధ్య ఈ తెల్లవారుజామున ఎదురుకాల్పులు చోటుచేసుకున్నాయి. ఈ కాల్పుల్లో ముగ్గురు ఉగ్రవాదులు హతమయ్యారు. సంఘటనా స్థలం నుంచి ఆయుధాలను, మందుగుండు సామాగ్రిని స్వాధీనం చేసుకున్నట్లు జమ్ముకశ్మీర్‌ పోలీసులు వెల్లడించారు.  

కశ్మీర్‌ ఐజీపీ విజయ్‌ కుమార్‌ వివరాలు వెల్లడిస్తూ... మృతిచెందిన ముగ్గురు జైషే-ఇ-మహ్మద్‌కు చెందిన ఉగ్రవాదులు. వీరిలో ఒకరిని అబ్దుల్‌ రెహ్మాన్‌ అలియాస్‌ ఫౌజీ భాయ్‌గా గుర్తించినట్లు తెలిపారు. పాకిస్తాన్‌లోని ముల్తాన్‌కు చెందిన ఇతడు ఐఈడీ ఎక్స్‌పర్ట్‌. 2017 నుంచి దక్షిణ కశ్మీర్‌లో ఉగ్రకార్యకలాపాల్లో క్రియాశీలకంగా ఉన్నట్లు పేర్కొన్నారు. 

మంగళవారం జరిగిన ఎన్‌కౌంటర్‌లో సైతం జైషే-ఇ-మహ్మద్‌కు చెందిన ఇద్దరు ఉగ్రవాదులు హతమైన సంగతి తెలిసిందే. మృతులను కశ్మీరీవాసులుగా గుర్తించారు. సంఘటనా నుంచి రెండు పిస్టల్స్‌ను పెద్దఎత్తున మందుగుండు సామాగ్రిని స్వాధీనం చేసుకున్నారు. 
logo