గురువారం 16 జూలై 2020
National - Jun 19, 2020 , 09:45:21

జమ్ములో ముగ్గురు ఉగ్రవాదుల హతం

జమ్ములో ముగ్గురు ఉగ్రవాదుల హతం

శ్రీనగర్‌: జమ్ముకశ్మీర్‌లో ఉగ్రవాదుల ఏరివేత కొనసాగుతున్నది. రాష్ట్రంలోని అవంతిపురా జిల్లాలో తాజాగా ముగ్గురు ఉగ్రవాదులను భద్రతాదళాలు మట్టుపెట్టాయి. జిల్లాలోని పాంపోర్‌లోని మీజ్‌ వద్ద నిన్న రాత్రి ఒక ఉగ్రవాది మట్టుపెట్టగా, మీజ్‌లోని మసీదులో దాక్కున్న మరో ఇద్దరిని ఈ రోజు ఉదయం భద్రతా దళాలు హతమార్చాయని జమ్ముకశ్మీర్‌ డీజీపీ దిల్బాగ్‌ సింగ్‌ వెల్లడించారు. 

మీజ్‌లో ఉగ్రవాదులు ఉన్నారనే సమాచారంతో భద్రతా బలగాలు గురువారం రాత్రి గాలింపు చేపట్టాయని, ఈ సందర్భంగా ఉగ్రవాదులు కాల్పులకు పాల్పడ్డారని చెప్పారు. ప్రతిగా భద్రతా దళాలు జరిపిన కాల్పుల్లో ఒక ఉగ్రవాది మరణించాడని, మరో ఇద్దరు పారిపోయారని తెలిపారు. వారికోసం రక్షణ దళాలు గాలింపు చేపట్టాయని, వారిద్దరు మీజ్‌ వద్ద మసీదులో దాక్కున్నారని డీజీపీ వెల్లడించారు. ఈ రోజు తెల్లవారుజామున జరిగిన ఎన్‌కౌంటర్‌లో ఇద్దరు ఉగ్రవాదులు మరణించారని చెప్పారు.


logo