సోమవారం 13 జూలై 2020
National - Jun 26, 2020 , 13:19:52

సైన్యం చేతిలో ముగ్గురు ఉగ్ర‌వాదులు హ‌తం

సైన్యం చేతిలో ముగ్గురు ఉగ్ర‌వాదులు హ‌తం

న్యూఢిల్లీ: జ‌మ్ముక‌శ్మీర్‌లో ఉగ్ర‌వాదుల ఆగ‌డాలు మితిమీరుతున్నాయి. పాకిస్థాన్ నుంచి దేశంలోకి అక్ర‌మంగా చొర‌బ‌డి అల‌జ‌డులు సృష్టించేందుకు ఉగ్ర‌వాదులు నిత్యం కుట్ర‌లు ప‌న్నుతున్నారు. తాజాగా పుల్వామా జిల్లా అవంతిపొర ప‌ట్ట‌ణం ట్రాల్ ఏరియాలోగ‌ల చెవా ఉలార్ ప్రాంతంలో ఉగ్ర‌వాదులు, సైనికుల‌కు మ‌ధ్య ఎదురు కాల్పులు చోటుచేసుకున్నాయి. ఈ కాల్పుల్లో ముగ్గురు ఉగ్ర‌వాదులు హ‌త‌మ‌య్యాయి. 

చెవా ఉలార్ ప్రాంతంలో ఉగ్ర‌వాదుల క‌ద‌లిక‌ల‌ను ప‌సిగ‌ట్టిన సైన్యం వారు దాగి ఉన్న ప్రాంతాన్ని చుట్టుముట్టి లొంగిపోవాల‌ని ఆదేశించింది. అయితే ఉగ్ర‌వాదులు కాల్పుల‌కు దిగ‌డంతో సైన్యం ఎదురు కాల్పులు జ‌రిపింది. ఈ కాల్పుల్లో ఇప్ప‌టికే ముగ్గురు ఉగ్ర‌వాదులు హ‌త‌మ‌వ‌గా.. ఆప‌రేష‌న్ ఇంకా కొన‌సాగుతున్న‌ద‌ని అధికారులు తెలిపారు.    ‌ 


logo